విరాట్ కోహ్లీ , గంభీర్‌లా యాంకర్ రోల్ పోషిస్తే.. వరల్డ్ కప్ మనదే! టీమిండియా మాజీ క్రికెటర్ కామెంట్...

Published : Jan 08, 2023, 04:01 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ టీమిండియా సెమీస్‌కే పరిమితమైంది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వరుసగా ఐసీసీ టోర్నీల్లో విఫలమవుతూ వస్తున్న భారత జట్టు...స్వదేశంలో జరుగుతున్న 2023 వన్డే వరల్డ్ కప్‌లో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది...

PREV
17
విరాట్ కోహ్లీ ,  గంభీర్‌లా యాంకర్ రోల్ పోషిస్తే.. వరల్డ్ కప్ మనదే! టీమిండియా మాజీ క్రికెటర్ కామెంట్...
india vs sl

2011లో స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంకను ఓడించి, టైటిల్ కైవసం చేసుకుంది భారత జట్టు. ఇది జరిగిన 12 ఏళ్లకు మళ్లీ స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ఆడబోతోంది టీమిండియా. దీంతో ఈసారి కూడా మనవాళ్లే హాట్ ఫెవరెట్లుగా బరిలో దిగుతున్నారు...

27

‘2011 వన్డే వరల్డ్ కప్‌లో గౌతమ్ గంభీర్, టీమిండియా విజయంలో మేజర్ రోల్ పోషించాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ అలాంటి పాత్రే పోషించబోతున్నాడు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్లు ఫ్రీ ఆడడానికి విరాట్ కోహ్లీ వంటి సీనియర్ అవతలి ఎండ్‌లో ఉండడం చాలా అవసరం...

37

ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేసినప్పుడు, సూర్యకుమార్ యాదవ్ వన్డే వరల్డ్ కప్‌లో అదరగొట్టినప్పుడు కూడా అవతలి ఎండ్‌లో విరాట్ కోహ్లీ యాంకర్ రోల్ పోషించాడు. విరాట్ ఓ ఎండ్‌లో పాతుకుపోయి, స్ట్రైయిక్ రొటేట్ చేస్తుంటే ఇవతలి ఎండ్‌లో ప్లేయర్లు ఆత్మవిశ్వాసంతో ఆడతారు...

47
Image credit: PTI

ఎప్పుడు ఎలా ఆడాలని విరాట్ కోహ్లీ ఇచ్చే విలువైన సలహాలు కూడా కుర్రాళ్లలో ధైర్యం నూరిపోస్తాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ రోల్‌ ఏంటో అతనికి పూర్తి క్లారిటీ వచ్చింది. ఒంటి చేత్తో మ్యాచులు గెలిపించాలని అనుకోవడం లేదు, టీమ్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు...

57

కుర్రాళ్లు ఫ్రీగా ఆడేలా ప్రోత్సహిస్తున్నాడు. యాంకర్ రోల్ పోషించడానికి కూడా ఏ మాత్రం ఫీల్ అవ్వడం లేదు. ఇషాన్ కిషన్ మాదిరిగానే చాలామంది కుర్రాళ్లు, తమ టాలెంట్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు...

67

రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్ వంటి ప్లేయర్లు ఐపీఎల్‌లో ఆడినట్టు టీమిండియాకి ఆడలేకపోయారు. దానికి కారణం వారిలో నిండుకున్న భయమే. 

77
Team India vs sri lanka

ఆల్‌రౌండర్లు, బ్యాటింగ్ ఆల్‌రౌండర్లు, బౌలింగ్ ఆల్‌రౌండర్లు.. ఇలా టీమ్‌లో ఆల్‌రౌండర్లు ఎంత ఎక్కువ మంది ఉంటే గెలిచే అవకాశాలు అంత ఎక్కువ ఉంటాయి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. 

Read more Photos on
click me!

Recommended Stories