వుమెన్స్ ఐపీఎల్ కాదు! వుమెన్స్ టీ20 లీగ్... వేలంలోకి స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్...

Published : Jan 08, 2023, 02:04 PM ISTUpdated : Jan 08, 2023, 02:08 PM IST

ఐపీఎల్ ప్రారంభమై 15 సీజన్లు ముగిసినా ఇప్పటికీ మహిళా ఐపీఎల్ తీసుకురాలేకపోయింది బీసీసీఐ. అనేక విమర్శలకు ఫుల్‌ స్టాప్ పెడుతూ 2023 సీజన్‌లో వుమెన్స్ ఐపీఎల్ రాబోతోంది. ఇప్పటికే బీసీసీఐ ఈ విషయాన్ని ఖరారు చేయగా వుమెన్స్ ఐపీఎల్‌కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి...  

PREV
18
వుమెన్స్ ఐపీఎల్ కాదు! వుమెన్స్ టీ20 లీగ్... వేలంలోకి స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్...
Image credit: PTI

వుమెన్స్ ఐపీఎల్‌కి బదులుగా వుమెన్స్ టీ20 లీగ్‌గా మహిళా టోర్నీకి పిలవబోతున్నారు. తొలి సీజన్‌లో ఐదు లేదా ఆరు జట్లతో వుమెన్స్ టీ20 లీగ్ జరగనుంది. ఈ లీగ్‌కి సంబంధించిన మీడియా రైట్స్ వేలాన్ని నాలుగు రోజుల పాటు వాయిదా వేశారు. వాస్తవానికి జనవరి 12న వుమెన్స్ ఐపీఎల్ ప్రసార హక్కుల వేలం జరగాల్సి ఉంది...

28
Harmanpreet Kaur-Smriti Mandhana

అయితే అనివార్య కారణాలతో వుమెన్స్ ఐపీఎల్‌ మీడియా హక్కులకు సంబంధించిన వేలాన్ని జనవరి 16న నిర్వహించబోతున్నారు. ఒకవేళ సీజన్ 2023 కోసం ఐదు జట్లు సిద్ధం కాకపోతే, ఈ ఏడాది టోర్నీని నిర్వహించరు. వచ్చే ఏడాదికి వాయిదా వేస్తారు...

38

అంటే కనీసం 75-80 మంది ప్లేయర్లు, వుమెన్స్ ఐపీఎల్‌లో పాల్గొంటేనే ఈ సీజన్‌లో లీగ్ జరుగుతుంది. ప్లేయర్లు తగ్గితే ఐదు జట్లను ఏర్పాటు చేయడం జరగని పని. కాబట్టి ఈ సీజన్‌లో టోర్నీ నిర్వహించబోమని బీసీసీఐ తెలియచేసింది. ఇదే జరిగితే మీడియా రైట్స్‌ వేలం కూడా మరోసారి నిర్వహించబడుతుంది...

48

వుమెన్స్ టీ20 లీగ్‌ని వేలం ద్వారా నిర్వహించబోతున్నారు. రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల బేస్ ప్రైజ్ వరకూ ప్లేయర్లు వేలంలోకి వస్తారు. అన్‌క్యాప్డ్ ప్లేయర్ల బేస్ ప్రైజ్ రూ.10-20 లక్షలుగా ఉంటే క్యాప్డ్ ప్లేయర్ల బేస్ ప్రైజ్ రూ.30-50 లక్షలుగా నిర్ణయించారు...

58
**EDS: TWITTER IMAGE POSTED BY @BCCIWomen** Derby: Indian batter Smriti Mandhana plays a shot during the 2nd T20 International cricket match between India and England, on Tuesday night, Sept. 13, 2022. India levelled the series 1-1. (PTI Photo)(PTI09_14_2022_000023B)

తొలి సీజన్ కావడంతో డ్రాఫ్ట్ పద్ధతిని అమలు చేసేందుకు బీసీసీఐ మొగ్గుచూపించడం లేదు. దీంతో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన వంటి స్టార్ ప్లేయర్లు కూడా వేలంలో పాల్గొనబోతున్నారు. వుమెన్స్ టీ20 లీగ్‌లో పాల్గొనాలని అనుకునే ప్లేయర్లు అందరూ ఆయా రాష్ట్రాల క్రికెట్ బోర్డుల ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది...

68

జనవరి 26 వరకూ రిజిస్ట్రేషన్‌కి గడువు ఉంది. రిజిస్ట్రేషన్ తర్వాత పురుషుల ఐపీఎల్ మాదిరిగానే సెట్స్ మాదిరిగా ప్లేయర్ల వేలం జరుగుతుంది. ఫిబ్రవరి 11న వేలం నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి...

78
Smriti Mandhana

మహారాష్ట్రలోని పూణే, ముంబై, నాగ్‌పూర్‌ వేదికల్లో మార్చి 6 నుంచి 26 వరకూ వుమెన్స్ టీ20 లీగ్ జరగనుంది. తొలి సీజన్‌లో ఒకే రాష్ట్రంలో నిర్వహించి, వచ్చే సీజన్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరింపచేయాలని ఆలోచనలు చేస్తోంది బీసీసీఐ...

88

చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ వంటి ఐపీఎల్ టాప్ ఫ్రాంఛైజీలన్నీ వుమెన్స్ టీ20 లీగ్‌లో జట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాయి. దీంతో వుమెన్స్ ఐపీఎల్ వేలం కూడా పురుషుల ఐపీఎల్ లెవెల్‌లో జరగనుంది.. 

click me!

Recommended Stories