తాత ఒలింపిక్ హాకీ లెజెండ్, తండ్రి యువీకి కోచ్... అండర్-19 హీరో రాజ్ భవ బ్యాక్‌డ్రాప్ తెలిస్తే...

Published : Feb 06, 2022, 04:40 PM IST

ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత యువ జట్టు అద్భుతమే చేసింది. హాట్ ఫెవరెట్స్‌గా బరిలో దిగి, ఆ అంచనాలకు మించి రాణించి, ఐదో టైటిల్ సాధించింది. ఈ టోర్నీలో రాజ్ భవ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు...

PREV
19
తాత ఒలింపిక్ హాకీ లెజెండ్, తండ్రి యువీకి కోచ్... అండర్-19 హీరో రాజ్ భవ బ్యాక్‌డ్రాప్ తెలిస్తే...

అండర్-19 వరల్డ్‌కప్ 2022 టోర్నీలో బ్యాటుతో 252 పరుగులు చేసిన రాజ్ భవ, బౌలింగ్‌లోనూ 9 వికెట్లు తీసి ఫైనల్‌లోనూ సత్తా చాటాడు...

29

సౌతాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన రాజ్ భవ, ఐర్లాండ్ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొంది 42 పరుగులు చేశాడు... అయితే వేగంగా పరుగులు చేయడం లేదనే విమర్శలు వచ్చాయి...

39

అయితే ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో 108 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్సర్లతో వీరవిహారం చేసిన రాజ్ భవ, అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

49

2004 అండర్-19 వరల్డ్‌కప్‌లో స్కాట్లాండ్‌పై శిఖర్ ధావన్ చేసిన 155 పరుగుల రికార్డును అధిగమించిన రాజ్ భవ, ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో చెలరేగిపోయాడు...

59

ఫైనల్ మ్యాచ్‌లో 31 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసిన రాజ్ భవ, ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్‌లో కకావికలం చేశాడు. బ్యాటుతోనూ 54 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు...

69

రాజ్ భవ తండ్రి సుక్విందర్ భవ, ఎవరో కాదు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కి కోచ్. 2000వ సంవత్సరంలో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచి, భారత జట్టుకి అండర్-19 వరల్డ్‌కప్ దక్కడంలో కీ రోల్ పోషించాడు యువీ...

79

ఆ సమయంలో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సుక్విందర్ భవ, ఇప్పుడు కొడుకు రాజ్ ఆనంద్ భవ పర్ఫామెన్స్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు...

89

రాజ్ భవ తాత సర్దార్ తర్లోచన్ సింగ్ భవ, 1948 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నారు... 

99

1948 ఒలింపిక్స్ హాకీ ఫైనల్స్‌లో తర్లోచన్ సింగ్ భవ, గ్రేట్ బ్రిటన్‌ను ఓడిస్తే... ఆయన మనవడు రాజ్ భవ, ఇంగ్లాండ్‌ను ఓడించి అండర్-19 వరల్డ్‌కప్ సాధించాడు... 

click me!

Recommended Stories