మలింగ మళ్లీ వస్తున్నాడు... టీ20 వరల్డ్‌కప్‌లో మలింగను బరిలో దింపేందుకు శ్రీలంక ప్రణాళిక...

First Published May 11, 2021, 12:27 PM IST

లసిత్ మలింగ... తన యార్కర్లతో ఎలాంటి బ్యాట్స్‌మెన్‌నైనా ఇబ్బందిపెట్టగల స్టార్ బౌలర్. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న మలింగను మళ్లీ బరిలో దింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది లంక క్రికెట్ బోర్డు...

శ్రీలంక క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్మెన్ ప్రమోద్య విక్రమ్‌సింగే, లసిత్ మలింగ రీఎంట్రీ గురించి వివరణ ఇచ్చాడు. వచ్చే టీ20 వరల్డ్‌కప్‌లో సర్‌ప్రైజ్ ప్యాక్‌గా మలింగ ఉండే అవకాశం ఉందంటూ హింట్ ఇచ్చాడు.
undefined
37 ఏళ్ల లసిత్ మలింగ, 2020 మార్చిలో వెస్టిండీస్‌పై చివరిసారిగా టీ20 సిరీస్ ఆడాడు. 2020 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడాల్సి ఉన్నా, తన తల్లిదండ్రులకు కరోనా సోకడంతో వాళ్ల దగ్గరే ఉండేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు మలింగ.
undefined
ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా ఉన్నాడు లసిత్ మలింగ. 2020 ఐపీఎల్ సమయంలో ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు ఈ స్టార్ పేసర్...
undefined
టెస్టులు, వన్డేలతో పాటు టీ20 ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి తప్పుకున్న లసిత్ మలింగతో టీ20 వరల్డ్‌కప్ ప్లాన్స్ గురించి మాట్లాడబోతున్నారట విక్రమ్ సింగే...
undefined
‘త్వరలోనే మలింగతో మాట్లాడతాం. టీ20 టూర్స్‌తో పాటు అక్టోబర్‌లో జరగబోయే టీ20 వరల్డ్‌కప్ గురించి ప్రణాళికలు చర్చించబోతున్నాం. అతను ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ అనే విషయం మరిచిపోకూడదు...
undefined
వరుసగా రెండేళ్లలో రెండు టీ20 వరల్డ్‌కప్‌లు జరగబోతున్నాం. ఇలాంటి సమయంలో జట్టుకు లసిత్ మలింగ లాంటి స్టార్, సీనియర్ పేసర్ అవసరం చాలా ఉంది...’ అంటూ తెలియచేశాడు లంక బోర్డు సెలక్టర్ విక్రమ్ సింగే...
undefined
‘నేను టెస్టుల నుంచి వన్డేల నుంచి రిటైర్ అయ్యాను. అయితే టీ20 ఫార్మాట్ నుంచి ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడకూడదని నిర్ణయించుకున్నది, దేశానికి టీ20లు ఆడాలనే ఉద్దేశంతోనే...
undefined
సెలక్షన్ కమిటీతో మాట్లాడేందుకు నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఓ సీనియర్ ప్లేయర్‌గా దేశం కోసం ఏం చేయగలనో అది చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే’ అంటూ తెలిపాడు లసిత్ మలింగ...
undefined
‘గత ఏడాది నుంచి నా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఎవ్వరూ నన్ను అడగలేదు. వారి ప్లాన్స్ వారికి ఉండొచ్చు. ఇప్పుడు నా అవసరం ఉందంటే, నేను బరిలో దిగేందుకు రెఢీ’ అంటూ తెలిపాడు మలింగ...
undefined
ఐపీఎల్‌లో 170 వికెట్లు తీసిన లసిత్ మలింగ, టీ20 క్రికెట్‌లో శ్రీలంక తరుపున 84 మ్యాచుల్లో 107 వికెట్లు తీశాడు. మలింగ ఎంట్రీ ఇస్తే, అతని కెప్టెన్సీలో లంక జట్టు టీ20 వరల్డ్‌కప్‌లో బరిలో దిగే అవకాశం ఉంటుంది.
undefined
click me!