ఆ విషయంలో పాండ్యా కూడా ధోని స్టైల్ నే ఫాలో అయ్యాడు.. : అశ్విన్

First Published Nov 25, 2022, 3:21 PM IST

టీమిండియా రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ గైర్హాజరీలో  న్యూజిలాండ్ తో  టీ20 సిరీస్ కు భారత జట్టుకు హార్ధిక్ పాండ్యా  కెప్టెన్ గా వ్యవహరించాడు.  తాజాగా హార్ధిక్ సారథ్యంపై  టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

Image credit: Getty

న్యూజిలాండ్ తో ఇటీవలే ముగిసిన  టీ20 సిరీస్ ను భారత్ 1-0తో గెలుచుకుంది. ఈ సిరీస్ లో  తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా  రెండో మ్యాచ్ సజావుగా సాగింది. ఈ మ్యాచ్ లో ఇండియా  సూపర్ విక్టరీ కొట్టింది.  మూడో మ్యాచ్ లో వరుణుడు పలుమార్లు  అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్  టైగా ముగిసింది.

అయితే మూడు మ్యాచ్ లలో  భారత జట్టు సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్ లకు చోటు కల్పించలేదు.  జట్టులో  సభ్యులుగా ఉన్నా ఆ ఇద్దరినీ ఆడించలేదు. ముఖ్యంగా టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ పదే పదే విఫలమవుతున్నా హార్ధిక్ పాండ్యా అతడినే కొనసాగించి సంజూను బెంచ్ కే పరిమితం చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

ఇదే విషయమై సిరీస్ ముగిసిన  తర్వాత విలేకరులు  హార్దిక్ పాండ్యాను శాంసన్ ను ఎందుకు ఆడించలేదు..? అని ప్రశ్నించారు. దానికి హార్ధిక్  కాస్త  అటిట్యూడ్ తో ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘నా జట్టు నా ఇష్టం’ అని  పాండ్యా చెప్పిన మాటలు వివాదాస్పదమయ్యాయి. ఒక్క ఐపీఎల్ ట్రోపీ గెలిచి   కెప్టెన్ గా  నాలుగు మ్యాచ్ లు  గెలిచినందుకే ఇంత బిల్డప్ అవసరమా..? అని  ఆరోపించారు.

Image credit: Getty

తాజాగా ఈ వివాదంపై  టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో స్పందించాడు.  ఈ విషయంలో పాండ్యా.. తలైవా ధోని స్టైల్ లో ఆన్సర్ ఇచ్చాడని వ్యాఖ్యానించాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘విలేకరులు అడిగిన ప్రశ్నకు  పాండ్యా ధోని స్టైల్ లో సమాధానం ఇవ్వాలనుకున్నాడో ఏమో గానీ  అతడు మాత్రం  మంచి  ఆన్సర్ ఇచ్చాడు.  రిపోర్టర్ అడిగిన  ప్రశ్నకు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా కూల్ గా సమాధానం చెప్పాడు.    పాండ్యా.. ధోనీలు చాలా క్లోజ్.  ధోనిని పాండ్యా గురువుగా భావిస్తాడు. అందుకే ఆ క్వశ్చన్ కు అంత బాగా సమాధానం చెప్పాడు..’ అని  అన్నాడు.

Hardik pandya Dhoni

అయితే విలేకరులు అడిగిన ప్రశ్నకు  పాండ్యా.. ‘అతడి (సంజూ శాసంన్)కు ఇది నా వ్యక్తిగతం కాదని తెలుసు. పరిస్థితులకు అనుగుణంగా జట్టును ఎంపిక చేస్తాం.  నేను ప్రజల మనిషిని.  ఎవరికైనా నా అవసరం ఉంటే  నేను వాళ్ల కోసం ఉంటా..  ఏ క్షణంలో అయినా ఎవరు తలుపుకొట్టినా నా గది తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఎందుకంటే ఎదుటివారి బాధను నేను అర్థం చేసుకోగలను..’ అని అన్నాడు. దీనినే అశ్విన్ ఇప్పుడు ప్రశంసించాడు.

Sanju Samson and Rishabh Pant

కానీ మీడియాలో మాత్రం  హార్ధిక్ పాండ్యా.. ‘‘ముందుగా మీకు ఒక విషయం  స్పష్టం చేయాలనుకున్నా.  బయట చాలా మంది జట్టు గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే వాళ్లు ఏం మాట్లాడినా  ఆ మాటలు మా పై ఎలాంటి ప్రభావమూ చూపించవు. ఇది నా జట్టు. హెడ్ కోచ్ తో చర్చించిన తర్వాతే  ఎవరు తుది జట్టులో ఉండాలి అనేది నిర్ణయించుకుంటాం.

Image credit: Getty

ఆ విధంగా ప్రణాళికలు, జట్టు వ్యూహాలు సిద్ధం చేసుకుంటాం.  ప్రతీ ఒక్కరికీ  ఎప్పుడో ఒకప్పుడు అవకాశం వస్తుంది.  ఈ సిరీస్ లో ఆడని వారికి భవిష్యత్ లో మరో సిరీస్ ఆడే ఛాన్స్ ఉంటుంది.. మేం ఇంకా ఆడాల్సిన కీలక సిరీస్ లు చాలా ఉన్నాయి.  న్యూజిలాండ్ టూర్ లో మాకు మరికొన్ని మ్యాచ్ లు ఉంటే మిగతా ఆటగాళ్లతో ప్రయోగాలు చేద్దామని అనుకున్నాం. కానీ  అది కుదరలేదు..’ అని  పాండ్యా చెప్పిన మాటలు ఎక్కువగా ట్రెండ్ అయ్యాయి.

click me!