వాళ్లిద్దరి కారణంగానే శిఖర్ ధావన్‌కి దక్కాల్సిన క్రేజ్ దక్కలేదు... మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

First Published Nov 25, 2022, 2:31 PM IST

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో సమానంగా పరుగులు చేయడంలో పోటీపడిన ప్లేయర్ శిఖర్ ధావన్. అయితే 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత శిఖర్ ధావన్ కెరీర్‌ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఐపీఎల్‌లో అదరగొడుతున్నా టీ20ల్లో పూర్తిగా చోటు కోల్పోయిన ధావన్...టెస్టులకు దూరమైన చాలా కాలమే అయ్యింది. వన్డేల్లో కూడా ధావన్ ప్లేస్ డౌట్‌గానే ఉంది...

Image credit: Getty

కెఎల్ రాహుల్‌తో పాటు శుబ్‌మన్ గిల్ కూడా వన్డేల్లో నిలకడైన ప్రదర్శన ఇస్తున్నాడు. దీంతో శిఖర్ ధావన్‌కి వన్డేల్లో అయినా ప్లేస్ ఉంటుందా? ఉండదా? అనేది అనుమానంగా మారింది. వరుసగా రెండు సిరీసుల్లో ఫెయిల్ అయితే ధావన్‌ని తీసి పక్కనబెట్టేయడం మాత్రం గ్యారెంటీ...

ఐసీసీ టోర్నీల్లో అద్భుతమైన ప్రదర్శన చూపిస్తూ... ‘మిస్టర్ ఐసీసీ టోర్నీస్’గా పేరు దక్కించుకున్న శిఖర్ ధావన్, గత రెండు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. వచ్చే వరల్డ్ కప్‌లో అయినా ధావన్‌కి చోటు ఉంటుందా? ఉండదా? అనేది అనుమానమే...

‘శిఖర్ ధావన్‌కి సుదీర్ఘమైన అనుభవం ఉంది. అయితే అతనికి దక్కాల్సినంత క్రేజ్, గుర్తింపు అయితే దక్కలేదు. కారణం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలే. ఈ ఇద్దరూ టీమిండియాలో సూపర్ స్టార్లుగా ఎదగడంతో శిఖర్ ధావన్‌‌కి పెద్దగా పేరు రాలేదు... 

Shikhar Dhawan

వన్డేల్లో శిఖర్ ధావన్‌కి అదిరిపోయే రికార్డు ఉంది. అతను టాప్ టీమ్స్‌పైన, కీలక మ్యాచుల్లో చాలా బాగా పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఒత్తిడి ఎక్కువగా సమయాల్లోనే శిఖర్ ధావన్ చక్కగా రాణిస్తాడు. టాపార్డర్‌లో ఓ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ ఉండడం చాలా ప్రత్యేకం... అతను ఆడే షాట్స్ కూడా అసాధారణం...

Shikhar Dhawan

టాప్ క్లాస్ వరల్డ్ బౌలర్లను చాలా చక్కగా ఎదుర్కొంటాడు. పుల్ షాట్, కట్ షాట్, డ్రైవ్ షాట్స్ అందంగా ఆడగలడు. అతని అనుభవం, టీమిండియాకి చాలా అవసరం. 

ఇండియాలో చాలామంది కుర్రాళ్లు, జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ధావన్‌కి ఉన్న అనుభవానికి విలువ చాలా ఎక్కువ...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. 

click me!