ఐపీఎల్ అంటే చాలా ఇష్టం... కానీ ఇలా ఆడడం చాలా కష్టం... కేకేఆర్ బ్యాట్స్‌మెన్ కామెంట్...

First Published Jan 29, 2021, 10:54 AM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్... విదేశీ క్రికెటర్ల కోసం కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉండే మోస్ట్ కాస్ట్‌లీ క్రికెట్ లీగ్. అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ టామ్ బాంటన్ మాత్రం ఐపీఎల్‌తో విసిగిపోయానని అంటున్నాడు. ఐపీఎల్‌లో ఆడిన మ్యాచుల కంటే రిజర్వు బెంచ్‌కే పరిమితమైందని ఎక్కువని, దీనికంటే కౌంటీ క్రికెట్ మ్యాచులు ఆడుకోవడం బెటరని కామెంట్ చేశాడు....

బిగ్‌బాష్ లీగ్‌తో పాటు ఇతర విదేశీ లీగ్‌ల్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టాడు ఇంగ్లాండ్ యంగ్ బ్యాట్స్‌మెన్ టామ్ బాంటన్...
undefined
ఐపీఎల్‌ 2020 సీజన్‌లో కోటి రూపాయల బేస్ ప్రైజ్‌కి టామ్ బాంటన్‌ను కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్... అయితే గత సీజన్‌లో ఈ ప్లేయర్‌కి పెద్దగా అవకాశం రాలేదు...
undefined
కేవలం రెండు మ్యాచులు మాత్రమే ఆడిన టామ్ బాంటన్... 18 పరుగులు చేశాడు. ఆ తర్వాత నిరూపించుకోవడానికి మరో ఛాన్స్ కూడా అతనికి దక్కలేదు...
undefined
ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు టామ్ బాంటన్‌ను మినీ వేలానికి విడుదల చేసింది కేకేఆర్... అతనితో పాటు క్రిస్ గ్రీన్, నాయక్, లాడ్, సిద్థార్థ్‌లను 2021 మినీవేలానికి వదిలేసింది...
undefined
2019లో జరిగిన టీ10 లీగ్‌లో 28 బంతుల్లో 80 పరుగులు చేసిన టామ్ బాంటన్... బిగ్‌బాష్ లీగ్‌లోనూ 180 స్ట్రైయిక్ రేటుతో పరుగులు సాధించాడు.
undefined
22 ఏళ్ల టామ్ బాంటన్... ఐపీఎల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు... ‘చిన్నతనం నుంచి ఐపీఎల్ చూస్తూ పెరిగాను. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే నాకు చాలా ఇష్టం...
undefined
కానీ గత సీజన్‌లో నేను రిజర్వు బెంచ్‌కే పరిమితం కావడం అస్సలు నచ్చలేదు. ఐపీఎల్ 2020 సీజన్ అద్భుతంగా జరిగింది... కానీ నేను ఎక్కువగా రిజర్వుబెంచ్‌లోనే కూర్చోవాల్సి వచ్చింది...
undefined
నేను బెంచ్ మీద కూర్చొనే వయసులో లేదు... క్రికెట్ ఆడాల్సిన స్టేజ్‌లో ఉన్నాను. టోర్నీ జరిగినన్ని రోజులు క్రికెట్ చూస్తున్నా, బ్యాటింగ్ చేయడాన్ని, ఆడడాన్ని బాగా మిస్ అయ్యా...
undefined
ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడాలా? వద్దా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదు... త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటాను... రిజర్వు బెంచ్‌లో కూర్చోవడం కంటే కౌంటీ క్రికెట్ ఆడడం బెటర్’ అంటూ కామెంట్ చేశాడు టామ్ బాంటన్...
undefined
2020 ఐపీఎల్ సీజన్‌లో 6 లీగ్ మ్యాచులకు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహారించిన విషయం తెలిసిందే. మోర్గాన్ కెప్టెన్సీలో కూడా టామ్ బాంటన్‌కి పెద్దగా అవకాశాలు రాకపోవడం విశేషం.
undefined
click me!