కనిపించేవన్నీ నిజాలు కావు! గొడవ తర్వాత విరాట్ కోహ్లీ పోస్ట్ వైరల్... నవీన్ వుల్ హక్ కూడా...

Published : May 02, 2023, 04:01 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచులన్నీ ఒక ఎత్తు అయితే, ఆర్‌సీబీ- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ తర్వాత జరిగిన సంఘటనలు మరో ఎత్తు. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, నవీన్ వుల్ హక్ మధ్య వాడి వేడి చర్చ జరిగి, ఐపీఎల్‌లో కావాల్సిన యాక్షన్‌ని జత చేసింది..

PREV
18
కనిపించేవన్నీ నిజాలు కావు! గొడవ తర్వాత విరాట్ కోహ్లీ పోస్ట్ వైరల్... నవీన్ వుల్ హక్ కూడా...
Virat Kohli-Naveen Ul Haq

బెంగళూరులో ఆర్‌సీబీపై ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ చేసుకున్న సెలబ్రేషన్స్‌తో మొదలైన రచ్చ, లక్నో దాకా వెళ్లింది. నవీన్ వుల్ హక్‌ని విరాట్ కోహ్లీ సెడ్జ్ చేయడం, ఆఫ్ఘాన్ కుర్ర క్రికెటర్ దానికి ఓవర్‌గా రియాక్డ్ అవడంతో గొడవ మొదలైంది..

28
Virat Kohli-Gautam Gambhir


నవీన్ వుల్ హక్ యాటిట్యూడ్‌ని తట్టుకోలేకపోయిన విరాట్ కోహ్లీ, మరింత ఆవేశంగా ఊగిపోవడంతో గ్రౌండ్‌లో ఓ మినీ రణరంగమే జరిగింది. చేతులతో కొట్టుకోవడం ఒక్కటే తక్కువ, గొడవ ఇంకాస్త మితిమీరి ఉంటే అది కూడా జరిగేదేమో... 

38

ఈ గొడవ తర్వాత క్రికెట్ ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయారు. ఎప్పటిలాగే విరాట్ కోహ్లీ అంటే ఇష్టపడనివాళ్లు, అతని ఆవేశం, నోటి దురుసు వల్లే ఇదంతా జరిగిందని అంటున్నారు... 

48

విరాట్ కోహ్లీ, నవీన్ వుల్ హక్ లాంటి కుర్రాడిని సెడ్జ్ చేయడం తగదని, అతను ఇప్పటికైనా కాస్త హుందాగా ఉండడం నేర్చుకోవాలని కామెంట్లు చేస్తున్నారు..

58

మరికొందరు విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ క్రికెటర్‌తో నవీన్ వుల్ హక్ వ్యవహరించిన విధానం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇంతకుముందు షాహిదీ ఆఫ్రిదీ, పెరేరా వంటి సీనియర్లతో కూడా నవీన్, దూకుడుగా ప్రవర్తించి గొడవ పెట్టుకున్న సందర్భాలను ప్రస్తావిస్తున్నారు..
 

68
Naveen vs Virat Kohli

లక్నోలో జరిగిన ఆ గొడవ తర్వాత విరాట్ కోహ్లీ ఇన్‌స్టాలో వేసిన కొటేషన్ హాట్ టాపిక్ అయ్యింది. ‘మనం వినేవన్నీ కేవలం అభిప్రాయాలు మాత్రమే, వాస్తవాలు కావు. అలాగే మనం చూసేవన్నీ జరిగినదానికి ఓ వైపు మాత్రమే నిజాలు కావు..’ అంటూ కొటేషన్‌గా స్టేటస్‌గా పెట్టాడు విరాట్ కోహ్లీ...

78
Virat Kohli-Naveen Ul Haq Fight

మ్యాచ్ తర్వాత ఆర్‌సీబీ ఛానెల్‌తో మాట్లాడుతూ ‘ఏదైనా తీసుకోగలిగినప్పుడే ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. లేకుండా ఏదీ ఇవ్వకూడదు... మాటలైనా, చేతలైనా’ అంటూ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు నవీన్ వుల్ హక్, గౌతమ్ గంభీర్‌ల గురించేనని తెలుస్తోంది.

88
Kohli vs Mishra and Naveen

విరాట్ కోహ్లీతో గొడవ తర్వాత చాలామంది భారతీయుల దృష్టిలో విలన్‌గా మారిపోయిన నవీన్ వుల్ హక్ కూడా దీనికి కౌంటర్ ఇచ్చాడు.  ‘నువ్వు దేనికి అర్హుడివో నీకు అదే దక్కుతుంది. ఏదైనా అలాగే జరుగుతుంది. అలాగే సాగుతుంది...’ అంటూ స్టేటస్ పెట్టిన నవీన్ వుల్ హక్, కోహ్లీ ఫ్యాన్స్ కామెంట్లతో విరుచుకుపడుతుండడంతో కామెంట్లను టర్న్ ఆఫ్ చేశాడు.. 

click me!

Recommended Stories