ఎవడీ నవీన్ వుల్ హక్... అప్పుడు షాహిద్ ఆఫ్రిదీతో,ఇప్పుడు విరాట్ కోహ్లీతో గొడవ...

Published : May 02, 2023, 09:16 AM IST

నవీన్ వుల్ హక్, ఇప్పుడు దేశమంతా వినిపిస్తున్న పేరు.  ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ సమయంలో అంత రచ్చ జరగడానికి ఓ కారణం ఈ కుర్రాడే. అసలు ఎవరీ నవీన్ వుల్ హక్..

PREV
18
ఎవడీ నవీన్ వుల్ హక్... అప్పుడు షాహిద్ ఆఫ్రిదీతో,ఇప్పుడు విరాట్ కోహ్లీతో గొడవ...
Afghanistan

ఆఫ్ఘాన్ ఫాస్ట్ బౌలర్ నవీన్ వుల్ హక్, ఇప్పటిదాకా 7 వన్డేలు, 21 టీ20 మ్యాచులు ఆడి 42 వికెట్లు తీశాడు. నవీన్ వుల్ హక్‌ని బ్రేస్ ప్రైజ్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్.. 

28

Shahid afridi

2020 పాక్ సూపర్ లీగ్‌లో పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిదీతో గొడవ పడి వెలుగులోకి వచ్చాడు నవీన్ వుల్ హక్. 23 ఏళ్ల నవీన్ వుల్ హక్, టాలెంట్ తక్కువ యాటిట్యూడ్ ఎక్కువ బాపతు ప్లేయర్. 

38

ఆవేశంతో ఊగిపోయే నవీన్, ఎలాంటి ప్లేయర్‌నైనా సెడ్జ్ చేసే విరాట్ కోహ్లీ సెడ్జింగ్‌ని సీరియస్ తీసుకోవడంతో అసలు గొడవ మొదలైంది. ప్రశాంతంగా సాగిపోతున్న ఐపీఎల్ 2023 సీజన్‌లో ఒక్కసారిగా అగ్గి రేగింది.  

48

విరాట్ కోహ్లీ సెడ్జ్ చేస్తే సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్ కూడా కామ్‌గా ప్రశాంతంగా ఉంటాడు. అయితే ఉడుకు రక్తం నవీన్ వుల్ హక్, అలా ఉండలేకపోయాడు. ఘాటుగా స్పందించి, భారీగా ఫైన్ చెల్లించబోతున్నాడు...
  

58

ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో నవీన్ వుల్ హక్‌‌ని విరాట్ కోహ్లీ సెడ్జ్ చేశాడు. ఆ తర్వాత అతను అవుట్ కాగానే అతిగా సెలబ్రేట్ చేసుకున్నాడు. దానికి నవీన్ వుల్ హక్ రియాక్ట్ కావడంతో గొడవ మొదలైంది...
 

68

మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో విరాట్ కోహ్లీ చేతిని గట్టిగా పట్టుకుని ఏదో తిట్టాడు నవీన్ వుల్ హక్. దానికి విరాట్ కోహ్లీ స్పందించి, ఏదో తిట్టి ముందుకు వెళ్లిపోయాడు. దీని తర్వాత కెఎల్ రాహుల్ వచ్చి, విరాట్ కోహ్లీతో ఏం జరిగిందని అడిగాడు...

78

నవీన్ వుల్ హక్ అటుగా వచ్చినా, విరాట్ కోహ్లీతో మాట్లాడనని సైగలు చేస్తూ వెళ్లిపోయాడు. ఈ గొడవతో నవీన్ వుల్ హక్ సోషల్ మీడియా అకౌంట్స్‌పై కోహ్లీ ఫ్యాన్స్ దాడి చేస్తున్నారు. బండ బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్నారు..

88
Naveen-ul-Haq

ఆర్‌సీబీ మ్యాచ్ తర్వాత నవీన్ వుల్ హక్ పోస్టు చేసిన ఫోటోకి నిమిషాల గ్యాప్‌లో 25 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. దారుణంగా తిడుతూ కోహ్లీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండడంతో అతను కామెంట్స్‌ని డిసేబుల్ చేశాడు..
 

Read more Photos on
click me!

Recommended Stories