ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన రెండు మ్యాచులు కూడా హై ఎండ్ డ్రామాకి వేదిక అయ్యాయి. బెంగళూరులో ఆఖరి బంతికి గెలిచిన లక్నో అక్కడ సంబరాలు చేసుకుంటే, లక్నోలో జరిగిన మ్యాచ్ రణరంగాన్ని తలపించింది...
గ్రౌండ్‌లో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ, లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్‌కి 100 శాతం మ్యాచ్ ఫీజుని జరిమానాగా విధించిన బీసీసీఐ, నవీన్ వుల్ హక్‌కి 50 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంత రచ్చ జరగడానికి ఓ రకంగా ఆవేశ్ ఖాన్ కూడా ఓ కారణం...
28
బెంగళూరులో ఆఖరి బంతికి గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్, అతిగా సెలబ్రేట్ చేసుకుంది. లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్, బెంగళూరు ఫ్యాన్స్‌కి వేలు చూపిస్తూ సైలెంట్‌గా ఉండాల్సిందిగా సైగలు చేశాడు. దీన్ని లక్నోలో రివర్స్ ఇచ్చేశాడు విరాట్ కోహ్లీ..
38
Image credit: PTI
బెంగళూరులో జరిగిన ఆర్‌సీబీ వర్సెస్ లక్నో మ్యాచ్‌లో చివరి బంతికి లెగ్ బైస్ రూపంలో సింగిల్ తీసిన ఆవేశ్ ఖాన్, పేరులో ఉన్న ఆవేశాన్ని ఆపుకోలేక హెల్మెట్ తీసి నేలకేసి బాదుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సెలబ్రేషన్ కారణంగా 10 శాతం మ్యాచ్ ఫీజు కూడా ఫైన్ కట్టాడు...
48
అయితే లక్నోలో ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు. ఒకవేళ ఆవేశ్ ఖాన్ ఉండి ఉంటే, నవీన్ వుల్ హక్ ప్లేస్‌లో 9వ వికెట్‌గా బ్యాటింగ్‌కి వచ్చేవాడు.
58
అప్పుడు విరాట్ కోహ్లీ, ఆవేశ్ ఖాన్‌ని ఎలా ఆడుకునేవాడో, ఏ రేంజ్‌లో సెడ్జ్ చేసేవాడో ఊహిస్తేనే భయంకరంగా ఉందంటూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు... ఓ రకంగా ఆవేశ్ ఖాన్ ఈ మ్యాచ్ ఆడకపోవడం అతనికే మంచిది అయ్యిందని, లేకపోతే సీన్స్ ఇంకోలా ఉండేవని పోస్టులు చేస్తున్నారు.
68
విరాట్ కోహ్లీ, నవీన్ వుల్ హక్‌ని సెడ్జ్ చేయడం, దానికి ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ స్పందించడంతోనే లక్నో, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్‌లో డ్రామా మొదలైంది. నవీన్ వుల్ హక్‌ని ‘నువ్వు నా కాలి దూళితో సమానం’ అనే అర్థం వచ్చేలా విరాట్ కోహ్లీ సైగలు చేయడం టీవీ కెమెరాల్లో కనిపించింది..
78
Kohli vs Mishra and Naveen
ఈ మాటలను విన్న అమిత్ మిశ్రా కూడా విరాట్ కోహ్లీపై ఫైర్ అయ్యాడు. అలా అనడం కరెక్ట్ కాదని ఏదో సర్ది చెప్పబోయాడు. అయితే విరాట్ కోహ్లీ ఏ మాత్రం తగ్గకుండా, అతను అన్నది బాగుందా? అంటూ ఆవేశంగా రియాక్ట్ అయ్యాడు.
88
గౌతమ్ గంభీర్ ఇదంతా గమనించాడు. కోహ్లీ, కైల్ మేయర్స్‌తో మాట్లాడుతుంటే అక్కడికి వచ్చిన గంభీర్, లక్నో ప్లేయర్‌ని పక్కకు తీసుకెళ్తూ ఏదో అన్నాడు. ఇక్కడ ఇద్దరి మధ్య వార్ ట్రిగర్ అయ్యింది. ఇద్దరూ మాట మాటా అనుకోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది.