sachin rohit
Rohit Sharma, Sachin Tendulkar: భారత్-శ్రీలంక తొలి వన్డే మ్యాచ్ టై అయింది కానీ, భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన తుఫాను బ్యాటింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. పవర్‌ప్లేలో మరోసారి బౌలర్లపై విధ్వంసం సృష్టిస్తూ 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 58 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
sachin tendulkar rohit sharma
ఈ మ్యంచ్ లో హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ తో ఓపెనర్‌గా 'గాడ్ ఆఫ్ క్రికెట్' సచిన్ టెండూల్కర్ రికార్డును హిట్‌మ్యాన్ సమం చేశాడు. అలాగే, అంతర్జాతీయ క్రికెట్‌లో 15,000 పరుగులను కూడా అందుకున్నాడు.
sachin rohit shots
అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా రోహిత్ శర్మ 50కి పైగా పరుగులు చేయడం ఇది 120వ సారి. దీంతో ఒపెనర్ గా అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును రోహిత్ సమం చేశాడు. సచిన్ కూడా ఓపెనర్‌గా తన కెరీర్‌లో 50కి పైగా 120 సార్లు స్కోర్ చేశాడు. ఈ లిస్టులో తన కెరీర్‌లో ఒపెనర్ గా 146 సార్లు 50కి పైగా పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ టాప్ లో ఉన్నాడు.
అలాగే, 58 పరుగుల ఈ ఇన్నింగ్స్ తో రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 15 వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. ప్రపంచంలో 10వ ఆటగాడిగా, భారతదేశం నుండి దీనిని సాధించిన మూడవ ఆటగాడిగా నిలిచాడు. హిట్‌మ్యాన్ కంటే ముందు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ ఈ ఘనత సాధించారు.
Gambhir and Rohit
ఓపెనర్‌గా వేగంగా 15 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ తర్వాత రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ 331 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా, హిట్‌మన్ 352 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.
Rohit Sharma, Rahul Dravid
వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రాహుల్ ద్రవిడ్‌ను అధిగమించడంలో రోహిత్ శర్మ ఒక్క పరుగు తేడాతో ఉన్నాడు. ద్రవిడ్ ను అధిగమిస్తే రోహిత్ వన్డే క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచేవాడు. ప్రస్తుతం రోహిత్ 10767 పరుగులతో 5వ స్థానంలో ఉండగా, రాహుల్ ద్రవిడ్ 10768 పరుగులతో 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 18426 పరుగులతో మొదటి స్థానంలో, విరాట్ కోహ్లీ (13872) రెండో స్థానంలో, సౌరవ్ గంగూలీ (11221) మూడో స్థానంలో ఉన్నారు.