KL Rahul: ఇంకా కోలుకోని రాహుల్.. ఇంగ్లాండ్ పర్యటనకూ డౌటే..?

Published : Jun 14, 2022, 07:42 PM IST

IND vs ENG:  స్వదేశంలో  దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ కు ముందు గాయపడ్డ టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం అతడు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో  గడుపుతున్నాడు. 

PREV
16
KL Rahul: ఇంకా కోలుకోని రాహుల్.. ఇంగ్లాండ్ పర్యటనకూ డౌటే..?

టీమిండియాకు మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న  ఆటగాళ్లాలో ఒకడైన కెఎల్ రాహుల్ సఫారీ సిరీస్ కు ముందు గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే రాహుల్ కు అయిన గాయం చిన్నదే అని.. రెండు, మూడు వారాల్లో తగ్గిపోతుందని అనుకున్న అభిమానులకు అతడు షాకిచ్చాడు. 

26

ప్రస్తుతం  ఎన్సీఏ లో రిహాబిటేషన్ సెంటర్ లో గడుపుతున్న ఈ స్టార్ బ్యాటర్ ఇంకా కోలుకోలేదని తెలుస్తున్నది. రాహుల్ వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో జరుగుబోయే టెస్టుకు కూడా అందుబాటులో ఉండేది అనుమానంగానే ఉంది. 

36

క్రిక్ బజ్ నివేదిక ప్రకారం..  కెఎల్ రాహుల్ ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఆడేది అనుమానమే. రాహుల్ ఇంకా కోలుకోలేదు.  గాయం తగ్గి  అతడు రికవర్ అవుతన్నట్టు రెండు మూడు రోజుల క్రితం వార్తలు వినిపించినా అందులో వాస్తవం లేదని తేలింది. 

46

జులై 1-5 వరకు ఇండియా-ఇంగ్లాండ్ జట్లు గతేడాది అర్ధాంతరంగా ఆగిపోయిన  చివరి టెస్టును ఆడనున్నాయి.  భారత జట్టులో కొవిడ్ కేసులు పెరగడంతో ఈ సిరీస్ ను అర్థాంతరంగా వాయిదా వేశారు. అయితే ఈ టెస్టును మళ్లీ జులై మొదటివారంలో జరిపించేందుకు షెడ్యూల్ కూడా ఖరారైంది. 

56

ఈ సిరీస్ కోసం జూన్ 16న భారత జట్టులోని ఫస్ట్ బ్యాచ్ (కెప్టెన్ రోహిత్ తో పాటు సీనియర్ ఆటగాళ్లంతా) ఇంగ్లాండ్ కు వెళ్లనుంది.  రాహుల్ ద్రావిడ్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ తో పాటు మరికొందరు ఇండియా-సౌతాఫ్రికా సిరీస్ ముగిసిన తర్వాత  ఇంగ్లాండ్ కు బయల్దేరతారు. 

66

టెస్టు ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ తో మూడు టీ20లు, మూడు వన్డేలు కూడా ఆడనుంది. జులై 7 నుంచి 17 వరకు పరిమిత ఓవర్ల సిరీస్ లు జరగాల్సి ఉన్నాయి. మరి టెస్టుకు మిస్ అయ్యే రాహుల్.. వన్డేలు, టీ20లకైనా అందుబాటులో ఉంటాడా..? అనేది తేలాల్సి ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories