రిషబ్ పంత్ ఇంకా కుర్రాడే, అందుకే కంగారుపడుతున్నాడు... టీమిండియా కెప్టెన్‌పై వసీం జాఫర్...

Published : Jun 14, 2022, 05:41 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో అనుకోకుండా ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి, టీమ్ మేనేజ్‌మెంట్‌ని మెప్పించి... ఫుల్‌ టైమ్ కెప్టెన్‌గా ప్రమోషన్ కొట్టేశాడు రిషబ్ పంత్. ఐపీఎల్ 2021 సీజన్ గ్రూప్ స్టేజీలో ఢిల్లీ క్యాపిటల్స్‌ని టేబుల్ టాపర్‌ని నిలిపిన రిషబ్ పంత్, ఈసారి టీమ్‌ని ప్లేఆఫ్స్‌కి చేర్చలేకపోయాడు...

PREV
16
రిషబ్ పంత్ ఇంకా కుర్రాడే, అందుకే కంగారుపడుతున్నాడు... టీమిండియా కెప్టెన్‌పై వసీం జాఫర్...
Rishabh Pant

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్ వరకూ ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఓడి... పాయింట్ల పట్టికలో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.. ముంబైని ఓడించి ఉంటే, ఆర్‌సీబీని వెనక్కినెట్టి ప్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేది ఢిల్లీ క్యాపిటల్స్..

26

‘రిషబ్ పంత్ ఇంకా కుర్రాడే. అందుకే చాలాసార్లు మ్యాచులు కాస్త క్లిష్టంగా మారితే చాలు, కంగారుపడిపోతున్నాడు. ఐపీఎల్‌లో కూడా రిషబ్ పంత్‌లో ఈ లక్షణం కనిపించింది... దీని నుంచి బయటపడాలంటే పంత్ ఎక్కువ మ్యాచులకు కెప్టెన్సీ చేయాల్సి ఉంటుంది...

36
Image credit: PTI

కెప్టెన్‌గా మ్యాచులు ఆడే కొద్దీ, క్లిష్ట పరిస్థితులను ఎలా ఫేస్ చేయాలి, ఉత్కంఠభరిత మ్యాచుల్లో ప్రెషర్‌ని జయించి, విజయాలు ఎలా సాధించాలో రిషబ్ పంత్‌కి తెలిసి వస్తుంది... ఇప్పటికైతే అతనిలో ఆ కంగారు స్పష్టంగా కనిపిస్తోంది...
 

46
Rishabh Pant

మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి సిరీస్ గెలవడమంటే చాలా పెద్ద టాస్కే. అయితే టాస్‌తో సంబంధం లేకుండా భారత జట్టు చాలా బాగా ఆడుతోంది. దాన్ని మరింత మెరుగుపరిచి, గెలవడానికి మార్గం కనుక్కుంటేచాలు..

56

రెండు మ్యాచుల్లోనూ సౌతాఫ్రికా టాస్‌లు గెలిచింది. టీమిండియా టాస్ గెలిస్తే, వాళ్లు మ్యాచులు గెలవగలరా? అనేది కూడా టీమిండియా సామర్థ్యానికి పరీక్షగా మారనుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్... 

66

రోహిత్ శర్మ తర్వాత టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో ఉన్న రిషబ్ పంత్, మిగిలిన వారిని వెనక్కినెట్టాలంటే సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ గెలిచి తీరాల్సిందే... లేదంటే కెఎల్ రాహుల్ మాదిరిగానే రిషబ్ పంత్ కెప్టెన్సీపైన కూడా తీవ్రమైన ట్రోలింగ్ వస్తుంది...

Read more Photos on
click me!

Recommended Stories