టీ20 వరల్డ్ కప్ 2007, వన్డే వరల్డ్ కప్ 2011 టోర్నీ విజయాల్లో కీ రోల్ పోషించాడు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. 2011 వరల్డ్ కప్‌లో ‘మ్యాన్ ఆఫ్ సిరీస్’ గెలిచిన యువీ, కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు క్యాన్సర్ బారిన పడ్డాడు..
2011 వన్డే వరల్డ్ కప్ సమయంలోనే యువరాజ్ సింగ్ ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడుతున్నట్టు తెలిసింది. వెస్టిండీస్‌తో మ్యాచ్ సమయంలో గ్రౌండ్‌లోనే రక్తపు వాంతులు చేసుకున్న యువీ, మొండి పట్టుదలతో బ్యాటింగ్ కొనసాగించి 36 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశాడు. 123 బంతుల్లో 113 పరుగులు చేసిన యువీ, 2 వికెట్లు కూడా తీశాడు..
28
వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అమెరికాలో క్యాన్సర్‌కి చికిత్స తీసుకున్న యువరాజ్ సింగ్, కీమో థెరపీ తర్వాత 2012 మార్చిలో ఆసుపత్రి నుంచి డిశార్జి అయ్యాడు. క్యాన్సర్ నుంచి కోలుకున్న యువీకి 2012 టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది..
38
Yuvraj Singh
2012 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 34 పరుగులు చేసిన యువీ, టోర్నీలో 8 వికెట్లు తీసి టీమిండియా తరుపున టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన జట్టులో యువరాజ్ సింగ్‌కి చోటు దక్కలేదు..
48
Image Credit: Getty Images
2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో 21 బంతుల్లో 11 పరుగులు చేసిన యువరాజ్ సింగ్, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై 32 బంతుల్లో 53 పరుగులు చేసిన యువీ, ఆ తర్వాత యోయో టెస్టులో ఫెయిల్ అవ్వడంతో టీమ్ నుంచి మరోసారి తప్పించబడ్డాడు..
58
Yuvraj Singh
‘భారత జట్టులోకి కమ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు విరాట్ కోహ్లీ చాలా సపోర్ట్ చేశాడు. అతని కెప్టెన్సీలో చాలా అవకాశాలు ఇచ్చాడు. విరాట్ కోహ్లీ సపోర్ట్ లేకపోతే నా కమ్‌బ్యాక్ జరిగేది కూడా కాదు...
68
Image Credit: Getty Images
మహేంద్ర సింగ్ ధోనీ, నాకు ఆప్తమిత్రుడు. సెలక్టర్లు నన్ను, 2019 వన్డే వరల్డ్ కప్ ఆడించాలని అనుకోవడం లేదని చెప్పాడు. ఏం జరగబోతుందో మాహీ వల్లే నేను గ్రహించాను. ధోనీ ఇచ్చిన క్లారిటీతోనే రిటైర్మెంట్ తీసుకున్నా...
78
2011 వన్డే వరల్డ్ కప్ వరకూ ధోనీతో ఆడడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. నువ్వు నా మెయిన్ ప్లేయర్‌వి అని చెప్పి నాలో ఉత్సాహాన్ని నింపేవాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ ఇద్దరూ ఫోన్లు చేసి నాలో ఆత్మవిశ్వాసం నింపారు...
88
క్యాన్సర్ నుంచి బయటికి వచ్చేసరికి టీమ్‌లో చాలా మార్పులు వచ్చాయి. ధోనీ టీమ్‌లో నా ప్రాధాన్యం తగ్గింది. అది వ్యక్తిగతం నన్ను చాలా బాధపెట్టింది...’ అంటూ కామెంట్ చేశాడు యువరాజ్ సింగ్..