మా అమ్మ ఇప్పటికీ ఇంజనీరింగ్ పూర్తిచేయనందుకు తిడుతూనే ఉంటుంది... కెఎల్ రాహుల్ షాకింగ్ కామెంట్...

First Published May 21, 2021, 5:07 PM IST

కెఎల్ రాహుల్... తన క్లాస్ బ్యాటింగ్‌తో టీమిండియా ఫ్యూచర్ స్టార్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్లేయర్. వన్డేల్లో, టీ20ల్లో అద్భుతంగా రాణిస్తూ.. టెస్టుల్లోనూ మంచి గణాంకాలు నమోదుచేసిన స్టార్ బ్యాట్స్‌మెన్. అయితే ఎంత చేసినా తన తల్లికి మాత్రం సంతోషాన్ని ఇవ్వలేకపోయాడట కెఎల్ రాహుల్...

వన్డేలు, టీ20ల్లో అవసరమైతే వికెట్ కీపింగ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉండే కెఎల్ రాహుల్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా, ఓపెనర్‌గా, ఫినిషర్‌గా కూడా రాణించగలనని నిరూపించుకున్నాడు...
undefined
‘క్రికెట్‌గా నాకు ఎంత పేరు, ప్రఖ్యాతలు వచ్చినా మా అమ్మకి అవి సంతోషాన్ని ఇవ్వలేకపోయాయి. నేను ఇంజనీరింగ్ పూర్తిచేయలేదు, పట్టా సంపాదించలేదని ఇప్పటికీ నన్ను తిడుతూనే ఉంటుంది...
undefined
నాకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె కాస్త సంతోషించింది. టీమిండియా తరుపున సెంచరీలు చేసినప్పుడు, జట్టును గెలిపించినప్పుడు కూడా ఆమెకు అవేమీ సంతోషాన్ని ఇవ్వలేదు’ అంటూ తెలిపాడు కెఎల్ రాహుల్.
undefined
29 ఏళ్ల కెఎల్ రాహుల్, ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు. 2021 సీజన్‌ మధ్యలో కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన కెఎల్ రాహుల్‌కి అపెండిక్స్ ఆపరేషన్ చేశారు వైద్యులు...
undefined
ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న కెఎల్ రాహుల్, వచ్చే నెలలో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే అంతకంటే ముందు తన ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది...
undefined
ఐపీఎల్ 2020 సీజన్‌లో 14 మ్యాచుల్లో 670 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఆరెంజ్ క్యాప్ గెలిచిన విషయం తెలిసిందే. 2021 సీజన్‌లోనూ ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో నిలిచాడు లోకేశ్ రాహుల్...
undefined
కర్ణాటకకు చెందిన కన్నూర్ లోకేశ్ రాహుల్, బెంగళూరులో బీకామ్ పూర్తిచేశాడు. కెఎల్ రాహుల్ తండ్రి కెఎన్ లోకేశ్ డాక్టర్ కాగా ఆయన తల్లి పేరు రాజేశ్వరి లోకేశ్.
undefined
click me!