కెఎల్ రాహుల్ అవుట్... టీమిండియా వైస్ కెప్టెన్ రేసులో జడేజా, పూజారా, అశ్విన్...

Published : Feb 20, 2023, 11:15 AM IST

రెండున్నరేళ్ల తర్వాత టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చి, నాలుగు మ్యాచులు ముగిసే సరికి వైస్ కెప్టెన్సీ దక్కించుకున్నాడు కెఎల్ రాహుల్. మయాంక్ అగర్వాల్ గాయపడడంతో అనుకోకుండా టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన కెఎల్ రాహుల్, సౌతాఫ్రికా టూర్‌లో కెప్టెన్సీ కూడా చేసేశాడు...

PREV
18
కెఎల్ రాహుల్ అవుట్... టీమిండియా వైస్ కెప్టెన్ రేసులో జడేజా, పూజారా, అశ్విన్...
KL Rahul

సౌతాఫ్రికా టూర్‌లో రెండో టెస్టుకి కెప్టెన్సీ చేసిన కెఎల్ రాహుల్, అప్పటిదాకా ఒక్క టెస్టు కూడా ఓడని జోహన్‌బర్గ్‌లో భారత జట్టుకి తొలి ఓటమిని పరిచయం చేశాడు. అదే టూర్‌లో వన్డే సిరీస్‌లో రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా క్లీన్ స్వీప్ అయ్యింది. అయినా కెఎల్ రాహుల్‌ని వైస్ కెప్టెన్‌గా కొనసాగిస్తూ వచ్చింది.

28
KL Rahul-Dravid

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టులకు కూడా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు కెఎల్ రాహుల్. అయితే మొదటి రెండు టెస్టుల్లో అట్టర్ ఫ్లాప్ అయిన రాహుల్, వైస్ కెప్టెన్సీ కోల్పోయాడు. మూడో టెస్టు నుంచి కొత్త వైస్ కెప్టెన్‌ని వెతకనుంది భారత జట్టు...

38
Image credit: PTI

సౌతాఫ్రికా టూర్‌కి ముందు అజింకా రహానే టీమిండియాకి టెస్టు వైస్ కెప్టెన్‌గా ఉండేవాడు. అయితే పేలవ ఫామ్‌తో రహానే టీమ్‌లో చోటు కోల్పోవడంతో ఆ ప్లేస్ రోహిత్ శర్మకు దక్కింది. కేప్‌టౌన్ టెస్టు తర్వాత విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రోహిత్ శర్మ సారథ్యం తీసుకున్నాడు.. కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్సీ దక్కించుకున్నాడు.

48
Cheteshwar Pujara

టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్సీ రేసులో ఛతేశ్వర్ పూజారా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా నిలిచారు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టుకి జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తే, పూజారా వైస్ కెప్టెన్సీ చేశాడు. 100 టెస్టులు ఆడిన పూజారా, కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా తప్పుకుంటే టీమ్‌ని నడిపించగలడా? 

58

రవిచంద్రన్ అశ్విన్‌, టెస్టుల్లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తూ అదరగొడుతున్నాడు. అనిల్ కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న అశ్విన్‌కి టెస్టు వైస్ కెప్టెన్సీ దక్కడం, అతనికి ఇచ్చిన గౌరవంగా మారుతుంది. రోహిత్ లేకున్నా జట్టును నడిపించే సత్తా, అశ్విన్‌కి ఉంది..

68
Image credit: PTI

రవీంద్ర జడేజా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు మ్యాచుల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచాడు. అయితే జడ్డూ గత రెండేళ్లలో దాదాపు ఐదు సార్లు గాయపడి, టీమ్‌కి దూరమయ్యాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో గాయంతో దూరమై 3 నెలలు టీమ్‌కి దూరంగా ఉన్నాడు..

78

ఆసియా కప్ 2022 మధ్యలో గాయపడిన రవీంద్ర జడేజా, ఐదు నెలల తర్వాత టీమ్‌లో కలిశాడు. రవీంద్ర జడేజాకి వైస్ కెప్టెన్సీ ఇస్తే, మళ్లీ మళ్లీ తాత్కాలిక వైస్ కెప్టెన్లను వెతుక్కోవాల్సి ఉంటుంది...

88
Image credit: Getty

ఈ ముగ్గురూ కాకుండా శ్రేయాస్ అయ్యర్‌కి టెస్టు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దేశవాళీ టోర్నీల్లో ముంబైకి సారథ్యం వహించిన అనుభవం ఉన్న అయ్యర్, టీమిండియాకి ఫ్యూచర్ టెస్టు కెప్టెన్‌గానూ పనికి వస్తాడని అంటున్నారు ఫ్యాన్స్.. 

click me!

Recommended Stories