టీమిండియా కంటే ఐపీఎల్ ముఖ్యం బుమ్రా... ఆ ఐసీసీ ఈవెంట్స్‌ కోసం ఐపీఎల్ నుంచి తప్పించగలరా...

Published : Feb 20, 2023, 10:31 AM IST

జస్ప్రిత్ బుమ్రా, ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి ఐదు నెలలు దాటిపోయింది... పెళ్లి తర్వాత వెన్నునొప్పితో బాధపడుతున్న జస్ప్రిత్ బుమ్రా, ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు గాయంతో జట్టుకి దూరమయ్యాడు. ఆ తర్వాత గత ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో రెండు టీ20 మ్యాచులు ఆడి.. గాయం తిరగబెట్టడంతో మళ్లీ టీమ్ నుంచి తప్పుకున్నాడు...

PREV
16
టీమిండియా కంటే ఐపీఎల్ ముఖ్యం బుమ్రా... ఆ ఐసీసీ ఈవెంట్స్‌ కోసం ఐపీఎల్ నుంచి తప్పించగలరా...
Jasprit Bumrah

గాయంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, ఫిట్‌గా ఉన్నానని ఎప్పుడో ప్రకటించాడు... అయితే బుమ్రా బౌలింగ్ వేసేటప్పుడు కాస్త ఇబ్బందిపడుతున్నాడని అందుకే అతన్ని ఆడించడం లేదని బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్‌ చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపెట్టాడు..

26

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో తొలుత జస్ప్రిత్ బుమ్రాకి చోటు దక్కలేదు. ఆ తర్వాత కొన్నిరోజులకు బుమ్రా కోలుకున్నాడని, వన్డే సిరీస్‌కి ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించింది టీమిండియా... మూడు రోజులకు మళ్లీ బుమ్రా కోలుకోలేదంటూ టీమ్ నుంచి తప్పించింది..

36
Image credit: Getty

జస్ప్రిత్ బుమ్రా కోలుకుంటున్నాడని ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులు ఆడతాడని ప్రకటించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... అయితే ఆఖరి రెండు టెస్టులకు కాదు కదా, ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్‌కి ప్రకటించిన జట్టులో కూడా జస్ప్రిత్ బుమ్రా పేరు కనిపించలేదు...

46
Image credit: Getty


నేరుగా ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపునే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు జస్ప్రిత్ బుమ్రా. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలకు బుమ్రాని అందుబాటులో ఉంచేందుకు అతనికి రెస్ట్ ఇస్తున్నట్టు ప్రకటించింది బీసీసీఐ...

56

అంతాబాగానే ఉంది కానీ టీమిండియా తరుపున మూడు వన్డేలు ఆడేందుకు ఫిట్‌గా లేని జస్ప్రిత్ బుమ్రా, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున 14 నుంచి 17 మ్యాచుల దాకా ఆడబోతున్నాడు... మూడు మ్యాచులు ఆడేందుకు లేని ఫిట్‌నెస్, ఐపీఎల్‌లో అన్ని మ్యాచులు ఆడేందుకు ఎలా వస్తుంది? అనేది అంతుచిక్కని ప్రశ్న..
 

66

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీల కోసం ఆస్ట్రేలియాతో టెస్టు, వన్డే సిరీస్‌ల నుంచి జస్ప్రిత్ బుమ్రాని తప్పించిన బీసీసీఐ, అతను ఐపీఎల్‌లో ఆడకుండా అడ్డుకోగలదా? దీనికి సమాధానం అందరికీ తెలిసిందే..

click me!

Recommended Stories