టీమిండియాలో ప్లేస్ కోసం ఎదురుచూసే ప్లేయర్ల సంఖ్య వందల్లో ఉంటే, తుది జట్టులో ఆడేవారి సంఖ్య ఎటు నుంచి ఎటు లాగినా పదకొండే. అయితే అట్టర్ ఫ్లాప్ అవుతున్న ప్లేయర్లకు మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తూ, కొందరు ప్లేయర్లను కావాలని టార్గెట్ చేయడం బీసీసీఐలో ఆనవాయితీగా మారింది...
పేలవ ఫామ్‌తో అట్టర్ ఫ్లాప్ అవుతున్న కెఎల్ రాహుల్‌ని నెత్తిన పెట్టుకుని, ఆడినా ఆడకపోయినా నువ్వు లేకపోతే టీమ్ ఆడలేదు మహాప్రభో... అన్నట్టుగా మోస్తున్న భారత క్రికెట్ బోర్డు, కొందరు ప్లేయర్లను కావాలని సైడ్ చేస్తోంది...
27
Sanju Samson
చేతన్ శర్వ స్టింగ్ ఆపరేషన్‌లో చెప్పినవన్నీ నిజాలేనని తేలుస్తూ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో సంజూ శాంసన్‌కి చోటు ఇవ్వలేదు బీసీసీఐ. చివరి రెండు టెస్టుల్లో అయినా సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, మనీశ్ పాండే వంటి ప్లేయర్లకు చోటు దక్కుతుందేమోనని ఆశించారు అభిమానులు..
37
అయితే తొలి రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 70 పరుగులు కూడా చేయలేకపోయిన కెఎల్ రాహుల్‌ని, చివరి రెండు టెస్టుల్లో కూడా ఆడిస్తామని సగర్వంగా ప్రకటించిన రాహుల్ ద్రావిడ్.. దేశవాళీ టోర్నీల్లో సర్ డాన్ బ్రాడ్‌మన్ సగటుకి చేరువలో ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌ని మరోసారి జోకర్‌గానే నిలబెట్టింది...
47
Sanju Samson-Chetan Sharma
అలాగే చేతన్ శర్మ, టీమిండియా యంగ్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ కెరీర్ కూడా ముగిసిపోతుంది. అతన్ని ఆడించే ఉద్దేశం తమకు లేదని చెప్పిన మాటలను నిజం చేస్తూ ఆసీస్‌తో వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో సంజూ శాంసన్ పేరు కనిపించలేదు...
57
Sanju Samson
గత ఏడాది వన్డేల్లో 66 సగటుతో పరుగులు చేసిన సంజూ శాంసన్, 104కి పైగా సగటుతో మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. రంజీ ట్రోఫీలో 85కి పైగా సగటుతో ఆకట్టుకున్నాడు. అయినా సంజూని పూర్తిగా సైడ్ చేసేసింది భారత జట్టు...
67
జస్ప్రిత్ బుమ్రా పూర్తిగా గాయం నుంచి కోలుకున్నా, అతన్ని ఐపీఎల్ కోసం అట్టిపెట్టిన బీసీసీఐ సెలక్టర్లు, ఏడాదిన్నరగా వన్డేల్లో ఫెయిల్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్‌కి కూడా ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో అవకాశం ఇచ్చారు...
77
Sanju Samson
సూర్యకుమార్ యాదవ్, వన్డే ఫార్మాట్‌కి సెట్ కాకున్నా అతన్ని సెలక్ట్ చేస్తూ, వరుస అవకాశాలు ఇస్తుండడం... సంజూ శాంసన్, వన్డేల్లో అదరగొడుతున్నా అతన్ని సైడ్ చేయాలని చూస్తుండడం బీసీసీఐలో రాజకీయాలు పరాకాష్టకు చేరాయనడానికి నిదర్శనం అంటున్నారు అభిమానులు.