పెళ్లి కాగానే టెస్టులు ఆడాలని పట్టుకొచ్చేశారు! పాపం... అందుకే కెఎల్ రాహుల్ ఇలా ఆడుతున్నాడు...

Published : Feb 25, 2023, 02:03 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొదటి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా ఎలాగైతే అట్టర్ ఫ్లాప్ అయ్యిందో, టీమిండియా బ్యాటర్ కెఎల్ రాహుల్ కూడా అదే ఫ్లాప్ పర్ఫామెన్స్ రిపీట్ చేశాడు... టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా కూడా తొలి రెండు మ్యాచుల్లో పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వకపోయినా బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ని కూర్చోబెట్టి కెఎల్ రాహుల్‌ని ఆడిస్తుండడంపై తీవ్రమైన చర్చ నడుస్తోంది...

PREV
18
పెళ్లి కాగానే టెస్టులు ఆడాలని పట్టుకొచ్చేశారు! పాపం... అందుకే కెఎల్ రాహుల్ ఇలా ఆడుతున్నాడు...
Image credit: PTI

మూడేళ్లుగా టెస్టుల్లో సెంచరీ చేయకపోయినా విరాట్ కోహ్లీ వన్డేల్లో రెండు సెంచరీలు, టీ20ల్లో ఓ సెంచరీ చేసి మంచి ఫామ్‌లో ఉన్నట్టు నిరూపించుకున్నాడు. రెండో టెస్టులో భారత టాపార్డర్ ఫెయిల్ అయిన సమయంలో 44 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు...

28
Image credit: PTI

బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సెంచరీ చేసిన ఛతేశ్వర్ పూజారా, మూడేళ్ల తర్వాత టెస్టుల్లో శతకాన్ని నమోదు చేశాడు. కాబట్టి ఈ ఇద్దరినీ వదిలేసిన అభిమానులు, మాజీ క్రికెటర్లు... కెఎల్ రాహుల్‌ని టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు...
 

38
Image credit: PTI

ఈ ఏడాది వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన శుబ్‌మన్ గిల్, టీ20ల్లో సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా మొదటి నెలలో మూడు సెంచరీలతో ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది మంత్ - జనవరి’ అవార్డు కూడా గెలిచాడు. అయితే కెఎల్ రాహుల్ కారణంగా శుబ్‌మన్ గిల్ తొలి రెండు టెస్టుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.. 
 

48
Image: KL Rahul, Athiya Shetty / Instagram

అదీకాకుండా 8 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ తర్వాత కెఎల్ రాహుల్ టెస్టు సగటు, లోయర్ ఆర్డర్‌లో వచ్చే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు సగటు కంటే తక్కువగా ఉండడం కూడా అతనిపై ట్రోల్స్ రావడానికి కారణమైంది...
 

58
KL Rahul-Dravid

టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా కెఎల్ రాహుల్‌కి మిగిలిన రెండు టెస్టుల్లో రెస్ట్ ఇవ్వడమే బెటర్ అంటూ కామెంట్ చేశాడు. అయిత శ్రీకాంత్, కెఎల్ రాహుల్‌ని పక్కనబెట్టడానికి చెప్పిన లాజిక్ వేరేగా ఉంది..

68
KL Rahul

‘కెఎల్ రాహుల్ టెక్నిక్‌లో నాకు ఎలాంటి లోపం కనిపించలేదు. అయితే అతను ఇప్పుడు మానసికంగా చాలా కృంగిపోయాడు. పెళ్లి కాగానే మూడు రోజులు కూడా కాకుండా టెస్టులు ఆడాలని తీసుకొచ్చేశారు. అతని మెంటల్ పొజిషన్ ఎలా ఉందో ఆలోచించారా?

78
Image credit: Getty

ఇప్పుడు అతనికి కావాల్సింది బ్రేక్. భార్యతో కొన్ని రోజులు ప్రశాంతంగా సంసార జీవితాన్ని గడపనీయండి. ఆ తర్వాత టీమిండియాకి ఆడడానికి కావాల్సిన అన్ని గన్స్ లోడ్ చేసుకుని తిరిగి వస్తాడు...

88
Athiya Shetty KL Rahul

 ఇప్పుడు శుబ్‌మన్ గిల్‌ని ఆడించడమే కరెక్టు... ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ని ఎక్కువ రోజులు రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టకూడదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. 

click me!

Recommended Stories