టీమిండియా నెక్స్ట్ సూపర్ స్టార్ అతడే.. ఫిట్‌గా ఉంటే 300 వికెట్లు పక్కా : దినేశ్ కార్తీక్

Published : Feb 25, 2023, 01:22 PM IST

స్పిన్నర్లు విజృంభిస్తున్న భారత్ పిచ్ లపై తనదైన బౌలింగ్ తో నానాటికీ రాటుదేలుతున్న హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ పై  టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ప్రశంసలు కురిపించాడు. 

PREV
16
టీమిండియా నెక్స్ట్ సూపర్ స్టార్ అతడే.. ఫిట్‌గా ఉంటే 300 వికెట్లు పక్కా : దినేశ్ కార్తీక్

టీమిండియా  వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్.. తన సహచర ఆటగాడు, హైదరాబాదీ  మహ్మద్ సిరాజ్ పై ప్రశంసలు కురిపించాడు.  టీమిండియా తరఫున అతడే నెక్ట్స్ సూపర్ స్టార్ అని,  గాయాలేమీ లేక ఫిట్ గా ఉంటే టెస్టులలో భారత్ తరఫున 300 వికెట్లు తీసిన బౌలర్ అవుతాడని కొనియాడాడు. 

26

క్రిక్ బజ్ నిర్వహిస్తున్న ‘రైస్ ఆఫ్ న్యూ ఇండియా’ లో కార్తీక్ ఈ వ్యాఖ్యలు చేశాడు.   ఐపీఎల్ లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆడుతున్నప్పుడు తాను సిరాజ్ ను దగ్గర్నుంచి చూశానని.. అతడు తన తప్పుల నుంచి నేర్చుకునే తత్వం కలవాడని   కార్తీక్ చెప్పాడు. 

36

కార్తీక్ మాట్లాడుతూ... ‘వచ్చే వన్డే వరల్డ్ కప్ (2023) లో సిరాజ్ కచ్చితంగా ఆడతాడు.  ఆ స్థానినికి సిరాజ్ అర్హుడు కూడా. గత కొంతకాలంగా అతడు  అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్నాడు.  ఐపీఎల్ - 2022లో  అతడికి చాలా నేర్పింది.   వైఫల్యాలను ధీటుగా ఎదుర్కోవడం.. ఒత్తిడిని అధిగమించడంలో  సిరాజ్ రాటుదేలాడు. 

46

రాబోయే రోజుల్లో అతడే టీమిండియా సూపర్ స్టార్. గాయాలేమీ లేకుండా ఫిట్ గా ఉంటే  భారత్ తరఫున టెస్టులలో 300 వికెట్లు తీసే బౌలర్ గా నిలుస్తాడు. అందులో అనుమానమే లేదు. సిరాజ్ కు ఆ సామర్థ్యముంది. టెస్టు క్రికెట్ లో సిరాజ్ ఎప్పటికీ ప్రమాదకారే.  వన్డేలలో కొంతకాలంగా సిరాజ్ అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్నాడు. టీ20లలో  ఇంకా అతడు నేర్చుకునే దశలోనే ఉన్నా అందులో కూడా రాణిస్తాడు...’అని చెప్పాడు. 

56

కాగా ఈ ఏడాది శ్రీలంక, న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో  సిరాజ్ దుమ్ము రేపాడు.  ఇన్ స్వింగర్, అవుట్ స్వింగర్, బౌన్సర్ లతో   ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మరీ ముఖ్యంగా పవర్ ప్లే ఓవర్స్  లో సిరాజ్ బంతులను ముట్టుకుంటే క్యాచ్, వదిలేస్తే వికెట్ అన్నంత రేంజ్ లో చెలరేగిపోయాడు. 

66

తాజాగా  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో కూడా సిరాజ్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. నాగ్‌పూర్ టెస్టులో  వేసిన రెండో బంతికే ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేశాడు.  ఆ తర్వాత  పెద్దగా వికెట్లేమీ తీయకపోయినా  స్పిన్నర్లతో కలిసి సహకారం అందిస్తున్నాడు. స్పిన్నర్లు పండుగ చేసుకుంటున్న పిచ్ లపై ఆసీస్ బ్యాటర్లకు ఒత్తిడిలో నెట్టడంలో షమీతో పాటు సిరాజ్ కూడా సఫలమవుతున్నాడు. 
 

click me!

Recommended Stories