ఏదో ఒకటి చేయండి బాస్! మీరు తోపులనుకుంటే పొట్లం అయిపోతారా... ఆస్ట్రేలియాపై క్రిష్ శ్రీకాంత్ కామెంట్...

Published : Feb 25, 2023, 01:22 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 ముగిసిన తర్వాత టీమిండియా ఎన్ని టీ20, వన్డే, టెస్టు సిరీసులు ఆడినా అందరి చూపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపైనే ఉండింది. కారణం టెస్టు నెం.1 టీమ్ ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య హోరాహోరీ ఫైట్ చూసే అవకాశం దొరుకుతుందని... అయితే మొదటి రెండు టెస్టుల్లో ఆసీస్ టీమ్ పర్ఫామెన్స్ అలా లేదు...

PREV
15
ఏదో ఒకటి చేయండి బాస్! మీరు తోపులనుకుంటే పొట్లం అయిపోతారా... ఆస్ట్రేలియాపై క్రిష్ శ్రీకాంత్ కామెంట్...
Image credit: PTI

ఐదు రోజుల పాటు ఆధిక్యం చేతులు మారుతూ ఉత్కంఠభరితంగా సాగే టెస్టు మ్యాచుల మజాని ఎంజాయ్ చేద్దామని అనుకుంటే... తొలి రెండు టెస్టులు కూడా మూడు రోజుల్లోనే ముగిశాయి. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే రెండున్నర రోజుల్లోనే చేతులు ఎత్తేసింది ఆస్ట్రేలియా..
 

25
Image credit: Getty

భారత స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ కలిసి ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో ఇప్పటికే సిరీస్ గెలిచే అవకాశాన్ని కోల్పోయిన ఆస్ట్రేలియా, 4-0 తేడాతో వైట్ వాష్ అయ్యే ప్రమాదంలో పడింది..

35
Image credit: PTI

నాగ్‌పూర్ టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన ఆస్ట్రేలియా, ఢిల్లీ టెస్టులో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలి టెస్టులో భారత జట్టు 400 స్కోరు చేస్తే, ఆస్ట్రేలియా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కూడా 300 దాటలేకపోయింది. ఢిల్లీ టెస్టులో కాస్త కోలుకున్నట్టు కనిపించినా రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది..

45
Image credit: PTI

ఇప్పటికే 2-0 తేడాతో టెస్టు సిరీస్ గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది ఆస్ట్రేలియా. మిగిలిన రెండు టెస్టుల్లో గెలిచినా సిరీస్ 2-2 తేడాతో సమం అవుతుంది. గత మూడు సీజన్లలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచిన భారత జట్టు, వరుసగా నాలుగోసారి టైటిల్‌ని నిలుపుకుంటుంది.. 

55

‘ఇది ఆస్ట్రేలియా మేనేజర్‌కి నేను ఇచ్చే మెసేజ్. ఏదైనా చేయండి బాస్.. ఈ సిరీస్‌కి ముందు మీపైన భారీ అంచనాలు పెట్టుకున్నాం. మీకు నేను ఇంగ్లీష్‌లో చెబుతా. ఇప్పటికైనా మీరు ఏదో ఒకటి చేయకపోతే పొట్లం అయిపోతారు.. అంటే ప్యాకెట్‌లాగ మిమ్మల్ని చుట్టేస్తారు.. ఇప్పటికే మీరు ప్యాక్ అయిపోయారు...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. 

click me!

Recommended Stories