ఇక చాలు! నీ ఆట చూసుకో... సైలెంట్‌గా కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్సీ పీకేసిన సెలక్టర్లు...

First Published Dec 29, 2022, 10:43 AM IST

లక్ విపరీతంగా కలిసి రావడంతో 2022 ఏడాదిని టీమిండియా కెప్టెన్‌గా ప్రారంభించాడు కెఎల్ రాహుల్. ఏడాదిలో మూడు టెస్టులు, వన్డేలు, టీ20 సిరీస్‌లకు కూడా కెప్టెన్సీ చేశాడు. సరిగ్గా 2022 ఏడాది చివరన కెఎల్ రాహుల్‌ని కెప్టెన్సీ రేసు నుంచి తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు సెలక్టర్లు..

Image credit: PTI

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గాయపడడంతో 2022 జనవరిలో జోహన్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టులో మొట్టమొదటిసారిగా టీమిండియాకి కెప్టెన్సీ చేశాడు కెఎల్ రాహుల్. ఆ మ్యాచ్‌లో భారత జట్టు చిత్తుగా ఓడింది. ఆ తర్వాత వన్డే సిరీస్‌లోనూ సారథిగా కొనసాగాడు. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్...

ఐపీఎల్ ముగిసిన తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్‌కి కూడా కెఎల్ రాహుల్‌నే కెప్టెన్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే ఐపీఎల్‌లో గాయపడిన కెఎల్ రాహుల్, ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో రాహుల్ ప్లేస్‌లో రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు...

గాయం నుంచి కోలుకుని జింబాబ్వే టూర్‌లో రీఎంట్రీ ఇచ్చిన కెఎల్ రాహుల్, వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించి తొలి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత ఆసియా కప్‌లో ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో మూడో వన్డేకి, టెస్టు సిరీస్‌కి సారథిగా వ్యవహరించాడు...

Image credit: Getty

ఏ మాత్రం కెప్టెన్సీ స్కిల్స్ లేవని రాహల్‌పై తీవ్ర విమర్శలు వచ్చినా, అతనినే టీమిండియా ఫ్యూచర్‌ కెప్టెన్‌గా చూస్తూ వచ్చింది మేనేజ్‌మెంట్. అయితే శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో రాహుల్‌పై వేటు వేశారు సెలక్టర్లు...
 

KL Rahul

రాహుల్ వన్డే టీమ్‌లో ఉన్నా, హార్ధిక్ పాండ్యాకి వైస్ కెప్టెన్సీ అందించారు. రోహిత్ శర్మ తర్వాత టీమిండియాకి వైట్ బాల్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. దీంతో కెఎల్ రాహుల్‌కి ఆటగాడిగా మాత్రమే చోటు దక్కింది...

KL Rahul

రోహిత్ శర్మ గాయపడితే హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా, కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. హార్ధిక్ పాండ్యా టెస్టులకు దూరంగా ఉండడంతో కెఎల్ రాహుల్‌కి టెస్టు కెప్టెన్సీ దక్కే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి... అక్కడ కూడా మనోడిని సైడ్ చేసి జస్ప్రిత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్‌లకి కెప్టెన్సీ ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

click me!