నాకు 2 రోజుల ముందే తెలుసు! నన్ను నేను కెప్టెన్‌గానే చూసుకుంటా... - రవిచంద్రన్ అశ్విన్...

Published : Jun 16, 2023, 09:28 AM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌కి చోటు దక్కకపోవడంపై తీవ్రమైన చర్చ జరిగింది. , ఐసీసీ నెం.1 టెస్టు బౌలర్, నెం.2 ఆల్‌రౌండర్‌గా ఉన్న అశ్విన్‌ని పక్కనబెట్టడంపై సచిన్, వీరూతో మాజీ క్రికెటర్లు అందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు...

PREV
17
నాకు 2 రోజుల ముందే తెలుసు! నన్ను నేను కెప్టెన్‌గానే చూసుకుంటా... - రవిచంద్రన్ అశ్విన్...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021 సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్, 2023 సీజన్‌లో కూడా టీమిండియా తరుపున టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయితే ఫైనల్‌లో అశ్విన్‌కి చోటు దక్కలేదు..
 

27

‘ఫైనల్ ఆడాలని నేను కూడా అనుకున్నా, గత డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా 4 వికెట్లు తీశాను. 2018 నుంచి విదేశాల్లో కూడా మెరుగ్గా వికెట్లు తీస్తున్నాను. విదేశాల్లో కూడా టీమ్‌కి విజయాలు అందించాను.. 
 

37

నేను బౌలర్‌గా మాత్రమే కాకుండా నన్ను నేను కెప్టెన్‌గా, కోచ్‌గా చూసుకుంటాను. మ్యాచ్ గెలవడానికి ఏం చేయగలనో నిత్యం ఆలోచిస్తూనే ఉంటా. గత ఇంగ్లాండ్ పర్యటనలో నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఓ స్పిన్నర్ కాంబినేషన్ వాడారు..
 

47

అందుకే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కూడా ఇదే ఎంచుకుని ఉంటారు. అయితే నాలుగో ఇన్నింగ్స్‌లో పిచ్, స్పిన్‌కి చక్కగా అనుకూలిస్తుంది. మ్యాచ్ రిజల్ట్‌ని డిసైడ్ చేసేందుకు ఇదే ముఖ్యం...

57

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి 2 రోజుల ముందు నన్ను తప్పించబోతున్నారనే విషయం నాకు అర్థమైంది. అయితే నాకు చోటు దక్కలేదని ఫీలవుతూ అక్కడే ఉండలేం కదా. జీవితంలో ఎలాంటి అనుభవాలు ఎదురైనా వాటిని దాటుకుంటూ పోవాల్సిందే...

67
Sachin-Ashwin

నాకు ఇప్పుడు 36 ఏళ్లు. ఈ వయసులో నాకు సంతోషాన్నిచ్చే విషయాలపైనే ఎక్కువ ఫోకస్ చేయాలని అనుకుంటున్నా. నాకు సీనియర్లు, మాజీ క్రికెటర్లు మెసేజ్ చేస్తూ ఉంటారు. 

77

నేను వెంటనే వారికి రిప్లై ఇస్తుంటాను. ఎందుకంటే వారి దృష్టిలో నేను ఇంకా యంగ్‌స్టర్‌నే.. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. వారి సలహాలు, సూచనలు కూడా నాకెంతో అవసరం...’ అంటూ కామెంట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్.. 

click me!

Recommended Stories