కెఎల్ రాహుల్ కెప్టెన్సీ అంటే ఆ మాత్రం ఉంటది... లోకల్ టీమ్ చేతుల్లో ఓడి టీమిండియా చెత్త రికార్డు...

Published : Oct 13, 2022, 03:51 PM IST

రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరు? ఈ విషయంలో అభిమానులకు అనేక అభిప్రాయాలు ఉన్నా, భారత క్రికెట్ బోర్డు మాత్రం ఎలాంటి డౌట్స్ పెట్టుకోలేదు. ఆరు నూరైనా, సెంచరీ హాఫ్ సెంచరీ అయినా కెఎల్ రాహుల్‌ని టీమిండియా కెప్టెన్‌గా నియమించాలని గట్టిగా ఫిక్స్ అయ్యింది... 

PREV
15
కెఎల్ రాహుల్ కెప్టెన్సీ అంటే ఆ మాత్రం ఉంటది... లోకల్ టీమ్ చేతుల్లో ఓడి టీమిండియా చెత్త రికార్డు...

టీ20 వరల్డ్ కప్ 2022 వార్మప్‌ మ్యాచ్‌లో భాగంగా వెస్ట్రరన్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ అవకాశం కల్పించింది టీమిండియా మేనేజ్‌మెంట్... భారత వైస్ కెప్టెన్‌గా ఉన్న రాహుల్, రోహిత్ శర్మ టీమ్‌లో ఉన్న ఈ మ్యాచ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం...

25
KL Rahul

అయితే 2022 జనవరిలో సౌతాఫ్రికా టూర్‌లో వరుసగా నాలుగు పరాజయాలతో టీమిండియా కెప్టెన్సీ కెరీర్ మొదలెట్టిన కెఎల్ రాహుల్, వార్మప్ మ్యాచ్‌లోనూ భారత జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. నెల రోజుల క్రితం జింబాబ్వే సిరీస్‌లో సిరీస్ నెగ్గి, ‘గెలిచా...’ అని చెప్పుకున్న కెఎల్ రాహుల్‌లో కెప్టెన్సీ స్కిల్స్ ఏ మాత్రం లేవని మరోసారి నిరూపితమైంది...

35
Image credit: Getty

వెస్ట్రరన్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది భారత జట్టు. స్థానిక జట్టు చేతుల్లో టీమిండియా ఓడిపోవడం టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే రికార్డు.  ఇంతకుముందు 2003 వన్డే వరల్డ్ కప్‌లో క్వా జులు నటల్ టీమ్, టీమిండియాని ఓడించింది. అయితే అది వన్డే. టీ20ల్లో మాత్రం టీమిండియా ఓ లోకల్ టీమ్ చేతుల్లో ఓడడం ఇదే మొట్టమొదటిసారి...

45
KL Rahul

జాతీయ జట్టును, ఐపీఎల్ టీమ్‌ని మ్యాచులు ఓడిపోతే... అవతల ప్రత్యర్థి బాగా ఆడారని సరిపెట్టుకోవచ్చు. అలాంటిది కనీసం లోకల్ టీమ్ చేతుల్లో కూడా ఓడిపోయేలా చేసి చెత్త రికార్డు క్రియేట్ చేయడంతో కెఎల్ రాహుల్‌ని తీవ్రంగా విమర్శిస్తున్నారు అభిమానులు...

55
KL Rahul

రోహిత్ శర్మ తర్వాత హార్ధిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్.. ఆఖరికి శుబ్‌మన్ గిల్‌కి కెప్టెన్సీ ఇచ్చినా పర్లేదు కానీ ఇలా ఓ లోకల్ టీమ్‌పై కూడా మ్యాచ్ గెలవలేకపోయిన కెఎల్ రాహుల్‌ చేతుల్లో టీమిండియా భవిష్యత్తును పెట్టొద్దని బీసీసీఐని వేడుకుంటున్నారు అభిమానులు... 

click me!

Recommended Stories