విరాట్ కోహ్లీ ఓ మాట మీద ఉండడు! రోహిత్ శర్మ మీటింగ్‌లోనే అన్నీ డిసైడ్ చేస్తాడు...

First Published Oct 13, 2022, 3:21 PM IST

ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ భారత జట్టుకి రెండు కళ్లు. ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు ఒకే టీమ్‌లో ఉండడం టీమిండియా అదృష్టమే. అయితే కపిల్ దేవ్-సునీల్ గవాస్కర్, గంగూలీ- రాహుల్ ద్రావిడ్ మాదిరిగా రోహిత్, విరాట్ కోహ్లీ ఇద్దరూ కెప్టెన్సీ విషయంలోనూ పోటీపడ్డారు. ఈ ఇద్దరిలో బెస్ట్ కెప్టెన్ ఎవరు?

న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ కోరీ అండర్సన్, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరుపున ఆడాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో మూడు సీజన్లు ఆడిన కోరీ అండర్సన్, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2018లో ఆర్‌సీబీకి ఆడాడు..


‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీ విధానం చాలా భిన్నంగా ఉంటుంది. విరాట్ కోహ్లీ ఫీల్డ్‌లో ఎక్కువ సమయం గడుపుతాడు. ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తాడు. ప్లేయర్ల బలబలాలపై అతని పూర్తి నమ్మకం ఉంటుంది. గ్రౌండ్‌లోనే ఏది వర్కవుట్ అవుతుంది, ఏది కాదని డిసైడ్ అవుతాడు...
 

Rohit Sharma laugh

రోహిత్ శర్మ ఎక్కువగా మీటింగ్స్‌కి సమయం వెచ్చిస్తాడు. అతను గేమ్‌ని అద్భుతంగా అర్థం చేసుకుంటాడు. గ్రౌండ్‌లో తక్కువగా యాక్టీవ్‌గా ఉన్నా, అతని బుర్రలో ఆలోచనలు కదులుతూనే ఉంటాయి.. మ్యాచ్ చేజారే క్షణాల్లో కూడా అవకాశాలను క్రియేట్ చేయగలడు...

Rohit Sharma

కోహ్లీకి బౌలర్లపై నమ్మకం ఎక్కువ. వాళ్లు బాగా వేయకపోయినా వారిని పూర్తిగా నమ్ముతాడు. అలాగే రోహిత్ శర్మ కూడా. ముంబై ఇండియన్స్ సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే అని నా నమ్మకం...’ అంటూ చెప్పుకొచ్చాడు కోరీ అండర్సన్...

‘విరాట్ కోహ్లీలో స్థిమితం తక్కువ. కొన్నిసార్లు ఓ ప్లాన్ వర్కవుట్ కాకపోతే వేరే దానికి వెళ్లిపోతూ ఉంటాడు..
రోహిత్ శర్మ మాత్రం అలా చేయడు. అతను అనుకున్న ప్లాన్ వర్కవుట్ కాకపోయినా అది వర్కవుట్ అయ్యేదాకా దాన్ని వదిలిపెట్టడు. అతనికి మొండి పట్టుదల ఎక్కువ...

Image credit: PTI

హార్ధిక్ పాండ్యా చాలా స్పెషల్ ప్లేయర్. అతని ఏ పొజిషన్‌లో అయినా ఇట్టే ఒదిగిపోయి ఆడగలడు. కెప్టెన్సీ కూడా చేయగలడు. బుమ్రా, హార్ధిక్ మీద ఎంతైనా పెట్టొచ్చు, వాళ్లు నష్టం తేరు... ’ అంటూ కామెంట్ చేశాడు కోరీ అండర్సన్... 

click me!