నువ్వు ఇలాగే ఆడితే, ఎప్పటికీ అతనిలా కాలేవు... రిషబ్ పంత్‌పై గౌతమ్ గంభీర్...

First Published Jan 25, 2022, 11:07 AM IST

ఆడిలైడ్ టెస్టు తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, టెస్టుల్లో కుదురుకుపోయి టీమ్‌కి కీలక ప్లేయర్‌గా మారిపోయాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఆ స్థాయి పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు...

రెండో వన్డేలో మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రిషబ్ పంత్, మొదటి వన్డేతో పాటు మూడో వన్డేలోనూ రాష్ షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు...

తొలి వన్డేలో 22 బంతుల్లో ఓ ఫోర్‌తో 16 పరుగులు చేసి అవుటైన రిషబ్ పంత్, మూడో వన్డేలో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు...

రెండో వన్డేలో 71 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు చేసిన రిషబ్ పంత్, షంసీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు..

‘రిషబ్ పంత్ చాలా స్పెషల్ ప్లేయర్. అతను మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడగలడు, ఇలా రాష్ షాట్స్ ఆడి వికెట్ పారేసుకోగలడు...

మేనేజ్‌మెంట్ ఓపిగ్గా ఉంటే, ఇలాంటి ప్లేయర్‌కి ఎన్ని అవకాశాలైనా వస్తాయి. ఇప్పుడు, ఇంతకుముందు రిషబ్ పంత్‌కి వచ్చిన అవకాశాలు ఇలాంటివే...

నువ్వు ఖడ్గంతో జీవించాలనుకుంటే, ఆ ఖడ్గంతోనే మరణిస్తావ్... రిషబ్ పంత్ ఇలాగే ఆడితే, ఎప్పటికీ విరాట్ కోహ్లీలా గొప్ప బ్యాట్స్‌మెన్ మాత్రం కాలేదు...

విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మిస్తూ, ఆ తర్వాత వేగం పెంచుతాడు. రిషబ్ పంత్‌ను అలా తయారుచేయాలంటే మేనేజ్‌మెంట్‌కి చాలా ఓపిక అవసరం...

రిషబ్ పంత్ నుంచి అలాంటి పర్పామెన్స్ రావాలంటే కొన్నేళ్లు ఓపిగ్గా వేచి చూడాల్సిందే... విరాట్ కోహ్లీ ఎన్నోసార్లు మ్యాచ్ ఫినిష్ చేశాడు. అయితే తన తర్వాత ఎవరు ఆ రోల్ పోషిస్తారు...

శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లతో పాటు రిషబ్ పంత్ కూడా మ్యాచ్ ఫినిషర్‌గా మారితేనే టీమిండియా ఐసీసీ టైటిల్స్ గెలవగలుగుతుంది...

రన్‌రేట్‌కి తగ్గట్టుగా ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలో విరాట్ కోహ్లీకి బాగా తెలుసు, యంగ్ బ్యాట్స్‌మెన్ ఆ విషయాన్ని నేర్చుకోవాలి...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్... 

click me!