బ్యాటింగ్ మొదలెట్టిన రిషబ్ పంత్... ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన కెఎల్ రాహుల్! శ్రేయాస్ అయ్యర్‌పైనే..

Published : Aug 04, 2023, 03:46 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీకి ముందు టీమిండియా ఫ్యాన్స్‌కి ఇది గుడ్‌న్యూసే. గాయంతో కొన్ని నెలలుగా టీమ్‌కి దూరంగా ఉన్న ఇద్దరు ప్లేయర్లు, త్వరలో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నారు..  

PREV
18
బ్యాటింగ్ మొదలెట్టిన రిషబ్ పంత్... ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన కెఎల్ రాహుల్! శ్రేయాస్ అయ్యర్‌పైనే..

ఐర్లాండ్ టూర్‌లో జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ రీఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. బుమ్రా గాయపడడంతో అతని ప్లేస్‌లో హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ వంటి ప్లేయర్లను ప్రయత్నించింది టీమిండియా. అయితే ఈ ఇద్దరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు..
 

28

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో జస్ప్రిత్ బుమ్రా ఆడితే, అది టీమిండియాకి రెట్టింపు ఉత్సాహం ఇవ్వడం గ్యారెంటీ. బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ ఫాస్ట్ బౌలర్లుగా ఎంపిక కావడం ఖాయం. వీరితో పాటు శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ, ముకేశ్ కుమార్ రూపంలో టీమిండియాకి ఆప్షన్లు ఉంటాయి..

38

కెఎల్ రాహుల్, ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. గాయానికి సర్జరీ చేయించుకున్న కెఎల్ రాహుల్, పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్టు ఎన్‌సీఏ తెలియచేసింది..

48

గత ఏడాది ఐర్లాండ్ టూర్‌కి ముందు కూడా ఇదే విధంగా కెఎల్ రాహుల్ అనూహ్యంగా ఫిట్‌నెస్ సాధించడంతో అతన్ని ఫ్లైట్ ఎక్కించింది టీమిండియా... తొలుత శిఖర్ ధావన్‌ని ఐర్లాండ్ టూర్‌లో టీమిండియాకి కెప్టెన్‌గా ప్రకటించినా, ఆ తర్వాత రాహుల్ కెప్టెన్సీలోనే ఆడింది.. 
 

58

ఈసారి ఐర్లాండ్ టూర్‌కి జస్ప్రిత్ బుమ్రాని కెప్టెన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. కెఎల్ రాహుల్ కోలుకోవడంతో మళ్లీ కెప్టెన్సీ మార్పులు, కెఎల్ రాహుల్‌ని జట్టులో చేర్చడం వంటివి టీమిండియా చేయనుందా? అనేది త్వరలో తేలిపోనుంది. 

68

డిసెంబర్ 2022లో కారు ప్రమాదానికి గురైన భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, అనుకున్నదాని కంటే వేగంగా కోలుకుంటూ డాక్టర్లను కూడా ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం ఎన్‌సీఏలో దాదాపు 140 కి.మీ.ల వేగంతో దూసుకువస్తున్న బంతులతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడట రిషబ్ పంత్...

78

రిషబ్ పంత్ కోలుకుంటున్న విధానం, టీమిండియాని ఆశ్చర్యపరుస్తోంది. అయితే పూర్తి ఫిట్‌నెస్ సాధించినా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో రిషబ్ పంత్‌ని ఆడించేందుకు బీసీసీఐ సాహసం చేయకపోవచ్చనే తెలుస్తోంది..

88
Shreyas Iyer

అప్పుడెప్పుడో మార్చిలో వెన్నుగాయంతో క్రికెట్‌కి దూరమైన శ్రేయాస్ అయ్యర్‌ ఫిట్‌నెస్ గురించి మాత్రం సరైన అప్‌డేట్స్ రావడం లేదు. అయ్యర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అతను కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనే విషయాన్ని కూడా డాక్టర్లు చెప్పలేకపోతున్నారట.. 

Read more Photos on
click me!

Recommended Stories