ఎంట్రీ అదిరింది! మొదటి మ్యాచ్‌లోనే రెండు రికార్డులు బ్రేక్ చేసిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ...

Published : Aug 04, 2023, 02:58 PM IST

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. ఐపీఎల్‌‌లో గత రెండు సీజన్లలో ముంబై ఇండియన్స్‌కి ఆడిన తిలక్ వర్మ, తన మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో రెండు రికార్డులు క్రియేట్ చేశాడు..  

PREV
16
ఎంట్రీ అదిరింది! మొదటి మ్యాచ్‌లోనే రెండు రికార్డులు బ్రేక్ చేసిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ...

 కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన ఛార్లెస్‌ని, తిలక్ వర్మ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌‌తో పెవిలియన్ చేర్చాడు. దాదాపు 10 మీటర్ల దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన తిలక్ వర్మ, డైవ్ చేస్తూ సూపర్బ్ క్యాచ్ అందుకున్నాడు..

26

ఆ తర్వాత నికోలస్ పూరన్ క్యాచ్ అందుకున్న తిలక్ వర్మ, సురేష్ రైనా తర్వాత ఆరంగ్రేటం టీ20 మ్యాచ్‌లోనే రెండు క్యాచులు అందుకున్న భారత క్రికెటర్‌గా నిలిచాడు...

36


బ్యాటింగ్‌లోనూ తిలక్ వర్మ మెరుపులు మెరిపించాడు. మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న తిలక్ వర్మ, మొదటి బంతిని డాట్ బాల్‌గా ఆడినా ఆ తర్వాత వరుసగా రెండు సిక్సర్లు బాదాడు..

46
Tilak Varma

మొత్తంగా 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసిన తిలక్ వర్మ, 20 ఏళ్ల వయసులో ఒకే టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. 2007లో సౌతాఫ్రికాపై రోహిత్ శర్మ, 2019లో బంగ్లాదేశ్‌పై వాషింగ్టన్ సుందర్ రెండేసి సిక్సర్లు బాదాడు..

56

ఆరంగ్రేటం మ్యాచ్‌లో 175కి పైగా స్ట్రైయిక్ రేటుతో 30కి పైగా పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్ తిలక్ వర్మ. ఇంతకుముందు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఈ ఫీట్ సాధించారు. యాదృచ్ఛికంగా ఈ ముగ్గురూ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ప్లేయర్లే కావడం విశేషం..
 

66

టీ20 ఆరంగ్రేటం మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన 8వ భారత బ్యాటర్ తిలక్ వర్మ. ఇంతకుముందు అజింకా రహానే 61, సూర్యకుమార్ యాదవ్ 57, ఇషాన్ కిషన్ 56, రాబిన్ ఊతప్ప 50, రోహిత్ శర్మ 50, మురళీ విజయ్ 48, బద్రీనాథ్ 43 పరుగులు చేశారు.  

click me!

Recommended Stories