ఎంతో మంది గొప్ప బ్యాటర్లు ఉండొచ్చు, కానీ విరాట్ కోహ్లీ ఒక్కడే నా దైవం! రియాన్ పరాగ్ కామెంట్స్..

Published : Aug 04, 2023, 01:10 PM IST

అస్సాం నుంచి ఐపీఎల్ ఆడిన మొట్టమొదటి క్రికెటర్ రియాన్ పరాగ్. ఐపీఎల్ 2023 సీజన్‌లో 7 మ్యాచులు ఆడి 78 పరుగులే చేసిన రియాన్ పరాగ్, ఇప్పటిదాకా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పెద్దగా నిరూపించుకోలేకపోయాడు. అయితే దేశవాళీ టోర్నీల్లో మాత్రం రియాన్ పరాగ్ చక్కగా రాణిస్తున్నాడు...  

PREV
16
ఎంతో మంది గొప్ప బ్యాటర్లు ఉండొచ్చు, కానీ విరాట్ కోహ్లీ ఒక్కడే నా దైవం! రియాన్ పరాగ్ కామెంట్స్..
Riyan Parag

దేవధర్ ట్రోఫీ 2023 టోర్నీలో 5 మ్యాచుల్లో 88.50 సగటుతో 354 పరుగులు చేశాడు రియాన్ పరాగ్. నార్త్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 131, వెస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 102 పరుగులు చేసిన రియాన్ పరాగ్, సౌత్ జోన్‌తో జరిగిన ఫైనల్‌లో 95 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..

26
Riyan Parag

టోర్నీలో 23 సిక్సర్లు కొట్టిన రియాన్ పరాగ్, బౌలింగ్‌లోనూ 11 వికెట్లు తీశాడు. దేవ్‌ధర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సర్లు, అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నిలిచిన రియాన్ పరాగ్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు..

36
Riyan Parag

‘విరాట్ కోహ్లీ నా దైవం, నా ఇన్‌స్పిరేషన్. ప్రపంచంలో ఎంతమంది గొప్ప బ్యాటర్లు అయినా ఉండొచ్చు, నేను మిగిలిన ఎవ్వరినీ పట్టించుకోను. నాకు తెలిసి నా మనసుకి దగ్గరైంది విరాట్ కోహ్లీ ఒక్కడే.. 

46
Riyan Parag

విరాట్ కోహ్లీతో నేను తరుచుగా మాట్లాడుతూ ఉంటాను. ఆయన నాకు ఎన్నో విలువైన సలహలు ఇస్తుంటారు. వ్యక్తిగానూ కోహ్లీతో నాకు చాలా పోలికలు ఉన్నాయి. నేనేం మాట్లాడినా ఆయనకు అర్థమవుతుంది, ఆయనేం చెప్పినా అది నా బుర్రలోకి ఎక్కేస్తుంది..

56
Riyan Parag

చాలామంది నాకు ఓవర్ కాన్పిడెన్స్ ఉందని, యాటిట్యూడ్ ఉందని అంటారు. అయితే అస్సాం నుంచి ఏ క్రికెటర్ కూడా ఇప్పటిదాకా ఐపీఎల్ ఆడలేదు. నేను దాన్ని మార్చాలని అనుకుంటున్నా. నాలో ఉన్న సత్తాపై నాకు నమ్మకం ఉంది..

66
riyan parag

వయసు పెరిగే కొద్దీ మెచ్యూరిటీ వస్తుంది. రెండేళ్ల క్రితం నా బ్యాటింగ్‌తో పోలిస్తే, ఇప్పుడు నా బ్యాటింగ్ బాగా మెరుగయ్యిందని నేను అనుకుంటున్నా.. బౌలింగ్ విషయంలో రవిచంద్రన్ అశ్విన్ నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటుంటా..’ అంటూ కామెంట్ చేశాడు రియాన్ పరాగ్.. 

Read more Photos on
click me!

Recommended Stories