పృథ్వీషాని చూసి నేర్చుకోండి... శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా బ్యాటింగ్‌పై బ్రెండన్ మెక్‌కల్లమ్ కామెంట్స్...

First Published Apr 30, 2021, 8:22 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుసగా విఫలమవుతున్నప్పటికీ యంగ్ ప్లేయర్లు శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణాలకు వరుస అవకాశాలు ఇస్తోంది కో‌ల్‌కత్తా నైట్‌రైడర్స్. అయితే ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్కటంటే ఒక్క శుభారంభం కూడా అందించలేకపోయింది ఈ ఓపెనింగ్ జోడి. ఈ ఇద్దరిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఏడు మ్యాచుల్లో 132 పరుగులు చేశాడు. సగటు 18.85 మాత్రమే కాగా స్ట్రైయిక్ రేటు 120 లోపే ఉంది. నితీశ్ రాణా మొదటి రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నా, ఆ తర్వాత వరుసగా ఫెయిల్ అవుతున్నాడు.
undefined
‘కేకేఆర్ బ్యాటింగ్ చాలా నిరుత్సాహంగా సాగుతోంది. ఇకపైన జట్టులో మార్పులు చేయడం అనివార్యం. ఓ ప్లేయర్‌గా జట్టు సెలక్షన్ విషయంలో నమ్మకం, నిజాయితీ ఉన్న ప్లేయర్లను తీసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది...
undefined
క్రీజులో అడుగుపెట్టిన తర్వాత అగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. నెమ్మదిగా సమయం తీసుకుని ఆడడానికి ఇది టెస్టు క్రికెట్ కాదు, టీ20 క్రికెట్. నేను కానీ, కెప్టెన్ మోర్గాన్ కానీ అడిగిన ప్లేయర్లను జట్టులోకి తీసుకురాలేకపోతున్నాం...
undefined
పృథ్వీషా బ్యాటింగ్ చూడండి. మొదటి ఓవర్ మొదటి బంతి నుంచి ఎలా ఆడాడో... అలాంటి దూకుడైన వ్యక్తిత్వంతో బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వెళితే, జట్టులోని మిగిలిన ప్లేయర్లు కూడా నమ్మకంతో బౌండరీలు బాదుతారు... మా ఓపెనర్లకి కూడా దూకుడుగా ఆడమని ఫ్రీ లైసెన్స్ ఇస్తున్నాం.
undefined
కానీ గిల్, రాణా బ్యాటింగ్ చేస్తున్న తీరు చాలా డిస్సపాయింట్‌గా ఉంది. మా జట్టులో థీమ్ మిస్ అయ్యింది. ఓ ప్లేయర్‌ ఆటను మార్చలేనప్పుడు, ఆటగాడినే మార్చేయాలి. కానీ అలా మార్చడానికి మాకు స్వాతంత్య్రందక్కడం లేదు...
undefined
పవర్ ప్లేలో ఎన్ని ఎక్కువ పరుగులు రాబడితే, జట్టుకి అంత అడ్వాంటేజ్ దక్కుతుంది. ఒక బౌండరీ వస్తే మరో బౌండరీ కోసం చూడాలి. అంతేకాని ఓ బౌండరీ బాదిన తర్వాత సింగిల్ తీద్దాం, నెమ్మదిగా బ్యాటింగ్ చేద్దాం అనే ఆలోచన ఉండకూడదు...
undefined
ఓ బౌండరీ బాదిన తర్వాతి బంతికే మరో బౌండరీ రాబడితే, బౌలర్ ఒత్తిడిలోకి వెళ్తాడు. అప్పుడు మరిన్ని ఎక్కువ పరుగులు రాబట్టడానికి అవకాశం ఉంటుంది. మా జట్టులో చాలామందికి ఈ ఆలోచన లేకపోవడమే కేకేఆర్ పర్ఫామెన్స్‌కి కారణం...’ అంటూ కామెంట్ చేశాడు బ్రెండన్ మెక్‌కల్లమ్.
undefined
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కామెంట్లను బట్టి చూస్తుంటే, రాబోయే మ్యాచుల్లో శుబ్‌మన్ గిల్‌కి తుదిజట్టులో చోటు దక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. అతనితో పాటు అప్పుడప్పుడు రాణించే నితీశ్ రాణాను పక్కనబెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు...
undefined
click me!