జింబాబ్వేపై గెలిస్తే కెఎల్ రాహుల్‌కి టీమిండియా కెప్టెన్సీ... మరి ఓడితే పరువు ఏం కాను...

First Published Aug 15, 2022, 4:15 PM IST

2022లో టీమిండియా ఓడిన ఏకైక సిరీస్... సౌతాఫ్రికా టూర్‌లోనే. ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికా గడ్డ మీద అడుగుపెట్టిన భారత జట్టు, టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో ఓడింది. ఆ తర్వాత వన్డే సిరీస్‌లో ఒక్క విజయం కూడా అందుకోలేక క్లీన్ స్వీప్ అయ్యింది. ఈ టూర్‌లో కెప్టెన్‌గా నాలుగు పరాజయాలు అందుకున్నాడు కెఎల్ రాహుల్... గత 50 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో మొదటి నాలుగు మ్యాచుల్లో పరాజయాలు ఎదుర్కొన్న మొట్టమొదటి భారత కెప్టెన్ కెఎల్ రాహులే...

ఈ సిరీస్ ఆరంభంలోనే విరాట్ కోహ్లీని తప్పించి, వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే టూర్ ఆరంభానికి ముందే రోహిత్ శర్మ గాయపడి... టెస్టు, వన్డే సిరీస్‌లకు దూరమయ్యాడు...

దీంతో వైస్ కెప్టెన్‌గా ఎంపికైన కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో రెండో టెస్టు ఆడిన భారత జట్టు, ఆ తర్వాత వన్డే సిరీస్‌ ఆడింది. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లు అందుబాటులో ఉన్నా... టీమిండియాకి ఒక్క విజయాన్ని అందించలేకపోయారు...

కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ‘అతనిలో ఏ మూలన కూడా కెప్టెన్సీ స్కిల్స్ కనిపించడం లేదని...’ బీసీసీఐ అధికారులే కామెంట్లు కూడా చేశారు. అయితే ఆ తర్వాత మరోసారి సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది బీసీసీఐ...

Image credit: PTI

ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ పర్వాలేదనే పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈ పర్ఫామెన్స్‌ని దృష్టిలో పెట్టుకున్న బీసీసీఐ, స్వదేశంలో సిరీస్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదనే ఉద్దేశంతో కెఎల్ రాహుల్‌ని కెప్టెన్‌గా ఎంచుకుంది...
 

అయితే సౌతాఫ్రికా సిరీస్ ఆరంభానికి ఒక్కరోజు ముందు గాయంతో కెఎల్ రాహుల్ తప్పుకున్నాడు. దీంతో రిషబ్ పంత్ కెప్టెన్సీలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడిన భారత జట్టు, మొదటి రెండు మ్యాచుల్లో ఓడినా ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచింది...

ఇప్పుడు మరోసారి జింబాబ్వే టూర్‌ సమయంలో కెఎల్ రాహుల్‌కి పిలుపు దక్కింది. దాదాపు ఆరు నెలల బ్రేక్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు కెఎల్ రాహుల్. తొలుత జింబాబ్వే టూర్‌కి ప్రకటించిన జట్టులో కెఎల్ రాహుల్ పేరు లేదు...

K L Rahul

తాను ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదని, అందుకే జింబాబ్వే టూర్‌కి దూరంగా ఉన్నట్టు బహిరంగ లేఖ ద్వారా స్టేట్‌మెంట్ కూడా పాస్ చేశాడు కెఎల్ రాహుల్. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ ఎన్‌సీఏలో కెఎల్ రాహుల్ ఫిట్‌నెస్ టెస్టు పాస్ కాగానే శిఖర్ ధావన్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించి, ఈ లక్నో కెప్టెన్‌కి కెప్టెన్సీ అప్పగిస్తున్నట్టు ప్రకటించింది బీసీసీఐ...

జింబాబ్వేపై సిరీస్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆసియా కప్‌ టోర్నీకి ముందు కెఎల్ రాహుల్‌‌కి ప్రాక్టీస్ అవసరమని అతన్ని జింబాబ్వేకి పంపించి ఉండవచ్చని క్రికెట్ విశ్లేషకుల అంచనా. అయితే ఈ వన్డే సిరీస్ గెలిస్తే.. టీమిండియా వైస్ కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ కొనసాగొచ్చు...

Image Credit: PTI

రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత వైస్ కెప్టెన్‌గా ఉన్న కెఎల్ రాహుల్‌కి టీమిండియా కెప్టెన్సీ దక్కొచ్చు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ మరి జింబాబ్వేపై సిరీస్ ఓడితే... టీమిండియా పరువు ఏం కాను! అని భయపడుతున్నారు టీమిండియా ఫ్యాన్స్...

click me!