యువరాజ్‌ని తలుచుకుని ఆ పని చేశా! రిజల్ట్ వచ్చింది... జింబాబ్వే స్టార్ రియాన్ బర్ల్...

First Published Aug 15, 2022, 3:39 PM IST

బంగ్లాదే‌శ్‌పై వన్డే సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన జింబాబ్వే, టీమిండియాతో వన్డే సిరీస్‌కి సిద్ధమైంది. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 34 పరుగులు రాబట్టిన రియాన్ బర్ల్, జింబాబ్వేకి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. టీమిండియాతో జరిగే వన్డే సిరీస్‌లోనూ రియాన్ బర్ల్‌పై భారీ ఆశలే పెట్టుకుంది జింబాబ్వే...

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో నసుమ్ అహ్మద్ బౌలింగ్‌లో ఐదు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 34 పరుగులు రాబట్టి సంచలనం క్రియేట్ చేశాడు రియాన్ బర్ల్...

టీ20 వరల్డ్ కప్ 2007లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరుకి ఆరు సిక్సర్లతో 36 పరుగులు రాబట్టిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రికార్డును కేవలం 2 పరుగుల తేడాతో మిస్ అయ్యాడు రియాన్ బర్ల్...

Ryan Burl

‘నేను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఓవర్‌లో 36 పరుగులు చేయడానికి ప్రయత్నించినప్పుడు, యువరాజ్ సింగ్, స్టువర్ట్ బ్రాడ్ ఓవర్‌లో కొట్టిన ఆరు సిక్సర్ల ఇన్నింగ్స్‌నే మనసులో తలుచుకున్నాను... 

యువీ చేసిన పనినే రిపీట్ చేయాలనే సంకల్పంతో షాట్స్ ఆడాను. యువరాజ్ సింగ్ ఓ అసాధారణ లెజెండ్. మాలాంటి ఎందరికో యువీయే ఇన్‌స్పిరేషన్... 
 

టీమిండియాతో జరిగే సిరీస్‌ని గెలవాలని పట్టుదలగా ఉన్నాం. ఇండియా, వరల్డ్‌లో బెస్ట్ టీమ్స్‌లో ఒకటి. వారిని ఓడించడం అంత తేలికైన విషయం కాదు. అయితే మేం గట్టి పోటీ ఇవ్వాలని అనుకుంటున్నాం...

మాకు హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. దాన్ని వాడుకుని కచ్ఛితంగా సిరీస్ గెలవాలనే కసితోనే ఆడుతాం... మాపై గెలవడం అంత తేలీకైన విషయం మాత్రం కాదు...’ అంటూ కామెంట్ చేశాడు 28 ఏళ్ల బ్యాటర్ రియాన్ బర్ల్...

జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 డిసైడర్ మ్యాచ్‌లో 28 బంతుల్లో 54 పరుగులు చేశాడు రియాన్ బర్ల్. రియాన్ ఇన్నింగ్స్ కారణంగా 10 పరుగుల తేడాతో బంగ్లాని ఓడించి, 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది జింబాబ్వే... 

click me!