టెస్టుల్లోకి లక్కీగా రీఎంట్రీ ఇచ్చిన కెఎల్ రాహుల్, అనుకోకుండా వచ్చిన ఆ అవకాశాన్ని చక్కగా వాడుకున్నాడు. ఇంగ్లాండ్ టూర్‌లో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు మయాంక్ అగర్వాల్ గాయపడడంతో రెండేళ్ల విరామం తర్వాత టెస్టుల్లోకి వచ్చిన కెఎల్ రాహుల్, ప్రస్తుత సఫారీ సిరీస్‌కి ఉపసారథిగా వ్యవహరిస్తున్నాడు...
తొలి టెస్టులో అద్భుత సెంచరీతో అదరగొట్టిన కెఎల్ రాహుల్, రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. రెండు టెస్టుల్లో 51 యావరేజ్‌తో 204 పరుగులు చేశాడు...
28
మయాంక్ అగర్వాల్ దూకుడుగా ఆడుతూ వచ్చిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలం అవుతుంటే, కెఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడుతూ, ఎంతో ఓపికగా ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నాడు...
38
లార్డ్స్‌లో సెంచరీ చేసిన కెఎల్ రాహుల్, ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో 8 ఇన్నింగ్స్‌ల్లో 315 పరుగులు చేసి... రోహిత్ శర్మతో కలిసి మంచి భాగస్వామ్యాలు నమోదు చేశాడు...
48
‘ఇప్పుడు టెస్టుల్లో కెఎల్ రాహుల్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అతన్ని కెఎల్ రాహుల్ 2.0 అని పిలవచ్చేమో... నా ఉద్దేశంతో కెఎల్ రాహుల్ ఆటతీరు మారడానికి అతని మైండ్‌సెట్‌లో వచ్చిన మార్పే కారణం...
58
రెండేళ్లుగా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోవడం కెఎల్ రాహుల్‌ను పున:సమీక్షించుకునేలా చేసింది. తాను చేసిన తప్పులేంటో తెలుసుకున్న కెఎల్ రాహుల్, వాటిని సరిదిద్దుకున్నాడు...
68
ఇది క్రికెటర్లకు ఓ స్వర్ణ యుగం లాంటిదే. ఎందుకంటే ఇప్పుడు క్రికెటర్లు మూడు ఫార్మాట్లు ఆడుతున్నారు. ఒకదాంట్లో కాకపోయినా మరోదాంట్లో అవకాశం దొరుకుతుంది. అయితే మూడు ఫార్మాట్లలో కొనసాగాలంటే అద్భుతమైన స్కిల్స్ ఉండాలి...
78
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మాదిరిగానే కెఎల్ రాహుల్ కూడా ఫార్మాట్‌కి తగ్గట్టుగా బ్యాటింగ్‌ను ఎలా మార్చుకోవాలో అర్థం చేసుకున్నాడు. టీ20ల్లో భారీ షాట్లు ఆడే కెఎల్ రాహుల్, టెస్టుల్లో ఎంతో ఓపికగా ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు...
88
ఇలాంటి పరిణతి సాధించాలంటే గేమ్‌ను అర్థం చేసుకోవాలి. సుదీర్ఘ ఫార్మాట్‌లో తొందరపాటు పనికి రాదు. ఇంగ్లాండ్ టూర్‌లో రోహిత్ శర్మ సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...