కేప్‌టౌన్ టెస్టులో జయంత్ యాదవ్ ఎంట్రీ... విరాట్ కోహ్లీ మరోసారి అశ్విన్‌ని పక్కనబెడతాడా?...

Published : Jan 10, 2022, 10:23 AM IST

మొదటి రెండు టెస్టుల్లో చెరో మ్యాచ్‌ గెలిచాయి ఇండియా, సౌతాఫ్రికా... కేప్‌ టౌన్ వేదికగా జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టు, సిరీస్ డిసైడర్‌గా మారనుంది. మొదటి రెండు టెస్టుల్లాగే మూడో టెస్టు మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా సాగుతుందని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్...

PREV
110
కేప్‌టౌన్ టెస్టులో జయంత్ యాదవ్ ఎంట్రీ... విరాట్ కోహ్లీ మరోసారి అశ్విన్‌ని పక్కనబెడతాడా?...

వెన్నునొప్పి కారణంగా జోహన్‌బర్గ్ టెస్టుకి దూరంగా ఉన్న భారత టెస్టు సారథి విరాట్ కోహ్లీ, కేప్ టౌన్ టెస్టులో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కోహ్లీ ఎవరి ప్లేస్‌లో తుదిజట్టులోకి వస్తాడనేది ఆసక్తికరంగా మారింది...

210

జోహన్‌బర్గ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఫెయిల్ అయిన అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా... రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో హాఫ్ సెంచరీలతో రాణించి, తమ స్థానాలను పదిలం చేసుకున్నారు...

310

విరాట్ కోహ్లీ స్థానంలో ఏడాది తర్వాత తుదిజట్టులో చోటు దక్కించుకున్న తెలుగు క్రికెటర్ హనుమ విహారి, రెండు ఇన్నింగ్స్‌ల్లో మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు...

410

అయితే పూజారా, రహానేలకు మరో ఛాన్స్ ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోందని, కాబట్టి హనుమ విహారి మరోసారి రిజర్వు బెంచ్‌కే పరిమితం కావచ్చని క్రికెట్ విశ్లేషకుల అంచనా...

510

అయితే రెండు టెస్టుల్లో కలిసి 3 వికెట్లు మాత్రమే తీయగలిగిన భారత ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో విరాట్ కోహ్లీ తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి...

610

అయితే జోహన్‌బర్గ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 50 బంతుల్లో 6 ఫోర్లతో 46 పరుగులు చేసి బ్యాటింగ్‌లోనూ రాణించాడు రవిచంద్రన్ అశ్విన్. కాబట్టి అశ్విన్‌కి కేప్ టౌన్ టెస్టులో తుదిజట్టులో చోటు దక్కే అవకాశం లేకపోలేదు...

710

అక్షర్ పటేల్ గాయంతో బాధపడుతుండడంతో సౌతాఫ్రికా టూర్‌కి ఎంపికైన మరో స్పిన్నర్ జయంత్ యాదవ్‌కి టెస్టుల్లో సెంచరీ కూడా ఉంది. కాబట్టి అశ్విన్ ప్లేస్‌లో జయంత్ యాదవ్ తుదిజట్టులో వచ్చే అవకాశం కూడా ఉంది...

810

జోహన్‌బర్గ్ టెస్టులో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడ్డాడు. అతని స్థానంలో ఉమేశ్ యాదవ్‌ లేదా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మలకు తుదిజట్టులో చోటు దక్కొచ్చు...

910

103 టెస్టులు ఆడిన ఇషాంత్ శర్మ, సౌతాఫ్రికా టూర్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరిగింది. ఇషాంత్‌కి కేప్ టౌన్ టెస్టు ఆఖరి మ్యాచ్ కావచ్చని కూడా ప్రచారం జరుగుతోంది...

1010

ఇషాంత్ శర్మ ఇంకా క్రికెట్‌లో కొనసాగాలని అనుకుంటే, మహ్మద్ సిరాజ్ స్థానంలో ఉమేశ్ యాదవ్‌కి తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది...

Read more Photos on
click me!

Recommended Stories