కెఎల్ రాహుల్, దీపక్ హుడా సిక్సర్ల మోత... భారీ స్కోరు చేసిన పంజాబ్ కింగ్స్...

Published : Apr 12, 2021, 09:33 PM IST

ఐపీఎల్ 2021: 14వ సీజన్‌లో తొలిసారిగా 200+ స్కోరు నమోదైంది. యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్‌తో పాటు కెఎల్ రాహుల్, దీపక్ హుడా... రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడడంతో వాంఖడే స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిసింది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన దీపక్ హుడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

PREV
110
కెఎల్ రాహుల్, దీపక్ హుడా సిక్సర్ల మోత... భారీ స్కోరు చేసిన పంజాబ్ కింగ్స్...

టాస్ ఓడి, బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 221 పరుగుల భారీ స్కోరు చేసింది. 9 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్‌ను చేతన్ సకారియా అవుట్ చేశాడు...

210

22 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్‌కి క్రిస్ గేల్, కెఎల్ రాహుల్ కలిసి 77 పరుగుల భాగస్వామ్యం అందించారు.

310

ఐపీఎల్‌ చరిత్రలో 350 సిక్సర్లు బాదిన మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు క్రిస్‌గేల్... 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసిన క్రిస్ గేల్‌ను రియాన్ పరాగ్ అవుట్ చేశాడు...

410

క్రిస్‌గేల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా... సిక్సర్ల వర్షం కురిపించాడు...  శివమ్ దూబే వేసిన ఓవర్‌లో రెండు సిక్సర్లు, శ్రేయాస్ గోపాల్ వేసిన 14వ ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదిన దీపక్ హుడా 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 

510

2015లో ఏప్రిల్ 15న రాజస్థాన్ రాయల్స్‌ తరుపున 22 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన దీపక్ హూడా, ఆరేళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజు రాజస్థాన్ రాయల్స్‌పై 20 బంతుల్లో అర్ధశతకం చేయడం విశేషం.

610

కెఎల్ రాహుల్‌తో కలిసి మూడో వికెట్‌కి 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన దీపక్ హుడా... ఇన్నింగ్స్ కారణంగా ఏకంగా 8 మంది బౌలర్లను ప్రయత్నించాడు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్.

710

ఆ తర్వాత నికోలస్ పూరన్, క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. బౌండరీకి ప్రయత్నించిన పూరన్‌ను ఓ కళ్లు చెదిరే క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు చేతన్ సకారియా...

810

ఐపీఎల్ కెరీర్‌లో 2 వేల పరుగులు పూర్తిచేసుకున్న కెఎల్ రాహుల్, 50 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 91 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 

910

చేతన్ సకారియా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన కెఎల్ రాహుల్, రాహుల్ తెవాటియాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

1010

జే రిచర్డ్‌సన్‌ను డకౌట్ చేసిన చేతన్ సకారియా... మొట్టమొదటి మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. క్రిస్ మోరిస్ రెండు వికెట్లు తీయగా రియాన్ పరాగ్‌కి ఓ వికెట్ దక్కింది. 

click me!

Recommended Stories