ఆ డబ్బులతో వారికి ఓ ఇల్లు కొనాలనుకుంటున్నా... రాజస్థాన్ రాయల్స్ బౌలర్ చేతన్ సకారియా...

Published : Apr 12, 2021, 08:10 PM ISTUpdated : Apr 12, 2021, 08:12 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్... ప్రపంచవ్యాప్తంగా ఎందరో క్రికెటర్ల జీవితాలను పూర్తి మార్చేసిన మెగా క్రికెట్ టోర్నీ. ఐపీఎల్ 2021 సీజన్ ద్వారా కొందరు యువ ఆటగాళ్లు వెలుగులోకి రానున్నారు. ఐపీఎల్ 2021 మినీ వేలంలో చేతన్ సకారియాను రూ. కోటి 20 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్...

PREV
111
ఆ డబ్బులతో వారికి ఓ ఇల్లు కొనాలనుకుంటున్నా... రాజస్థాన్ రాయల్స్ బౌలర్ చేతన్ సకారియా...

పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఓపెనింగ్ బౌలర్‌గా వచ్చిన చేతన్ సకారియా, రెండో ఓవర్‌లో మయాంక్ అగర్వాల్‌ను అవుట్ చేశాడు...

211

‘నేను 13 ఏళ్ల నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడం మొదలెట్టాను. నేను క్రికెట్‌లో రాణిస్తున్నా, మా ఇంటి ఆర్థిక పరిస్థితి కారణంగా చదువుపైన ఫోకస్ పెట్టమని చెప్పేవాళ్లు అమ్మానాన్న...

311

నేను ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనేది వారి కోరిక. కానీ నాకు క్రికెట్‌ అంటే పిచ్చి. క్రికెట్‌లోనే నా కెరీర్‌ వెతుక్కోవాలని అనుకున్నా. అందుకే పరీక్షలు ఉన్నా సరే, క్రికెట్ మ్యాచులు ఉంటే, వెళ్లిపోయేవాడివి...

411

నేను అండర్ 16 భారత జట్టుకు ఎంపికైన తర్వాత నేను క్రికెటర్‌గా రాణించగలనని మా అమ్మానాన్నకి నమ్మకం కలిగింది. అప్పటినుంచే వాళ్లు నన్ను ప్రోత్సాహించడం మొదలెట్టారు...

511

స్పోర్ట్స్ కోటాలో అయినా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకుంటానని వాళ్లు అనుకుని ఉండొచ్చు... ఐపీఎల్ 2021 వేలం జరుగుతున్నప్పుడు, విజయ్ హాజారే ట్రోఫీ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాం...

611

అప్పటికే అవీ బరోట్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. దాంతో నాకు భయం వేసింది. అయితే నేను వేలంలోకి రాగానే ఆర్‌సీబీ బిడ్డింగ్ వేయడంతో మనసు కుదుట పడింది...

711

రాజస్థాన్ రాయల్స్, ఆర్‌సీబీ జట్లు నా కోసం పోటీపడడం, ఆర్ఆర్ నాకోసం రూ. కోటి 20 లక్షలు చెల్లించేందుకు సిద్ధం కావడంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాను. ఆనందంతో గంతులు వేశాను...

811

ఐపీఎల్‌లో ఇంతకుముందు ముంబై ఇండియన్స్ క్యాంపులో ఆడాను. ఆ సమయంలో నా ఫెవరెట్ బౌలర్ జహీర్ ఖాన్, నాకు ఎన్నో సలహాలు ఇచ్చారు...
జహీర్ ఖాన్, నా బౌలింగ్ బాగుందని మెచ్చుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను. ఐపీఎల్ 2021 ద్వారా వచ్చే డబ్బుతో నా కుటుంబం కోసం ఓ ఇల్లు కొనాలని అనుకుంటున్నా... ’ అంటూ చెప్పుకొచ్చాడు చేతన్ సకారియా...

911

నాతో పాటు నా చుట్టూ ఉన్న సభ్యులందరూ బస్సులోనే అరుస్తూ కేకలు వేశారు... ఆనందంగా సంబరాలు చేశారు...  మాకు సొంత ఇల్లు లేదు. స్టేషనరీ షాపు నడిపే మా మామయ్య, మాకు ఎంతగానే సాయం చేశారు. స్కూల్ ఫీజు కట్టడం, క్రికెట్ ఆడడానికి డబ్బులు ఇచ్చేవాడు. ఆయన రుణం తీర్చుకోలేను...

1011

గత నెలలో సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 పాల్గొంటున్న సమయంలో చేతన్ సకారియా తమ్ముడు రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే విషయం తెలిస్తే, టోర్నీ మధ్యలోనే వచ్చేస్తాడని తల్లిదండ్రులు, సకారియాకి తమ్ముడి మరణవార్త కూడా చెప్పలేదు...

1111

‘సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ ఆడడానికి వెళ్లినప్పుడు తమ్ముడు సూసైడ్ చేసుకున్నాడు. నేను టోర్నీ ముగించుకుని, ఇంటికి వచ్చేవరకూ నాకీ విషయం తెలియనివ్వలేదు... నా తమ్ముడు లేని లోటు తీర్చలేనిది...

ఇప్పుడు తమ్ముడు ఉండి ఉంటే, నాకంటే ఎక్కువ సంతోషించేవాడు... సంతోషం, దు:ఖం కలిసి రావడం అంటే ఇదేనేమో... 2020 సీజన్ సమయంలో వచ్చే సీజన్ ఆడతానని అనుకున్నాను...’ అంటూ చెప్పుకొచ్చాడు చేతన్ సకారియా.

click me!

Recommended Stories