KKRvsCSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్... సీఎస్‌కే జోరుకి బ్రేకులు వేసేనా...

First Published Apr 21, 2021, 7:12 PM IST

టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్...

రెండు మార్పులతో బరిలో కేకేఆర్... హర్భజన్ సింగ్, షకీబ్ అల్ హసన్‌లకు రెస్ట్...

IPL 2021 సీజన్‌లో భాగంగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
undefined
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మూడు మ్యాచుల్లో ఒకే విజయం సొంతం చేసుకోగా, చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండు మ్యాచుల్లో ఘనవిజయాలు అందుకుని మంచి జోరు మీద ఉంది.
undefined
హర్భజన్ సింగ్, షకీబ్ అల్ హసన్‌లను జట్టు నుంచి తప్పించిన చెన్నై సూపర్ కింగ్స్, సునీల్ నరైన్, నాగర్‌కోటీలకు తుదిజట్టులో చోటు ఇచ్చింది.
undefined
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒకే ఒక్క మార్పుతో నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతోంది. డ్వేన్బ్రావో‌కి రెస్టు ఇచ్చి, ఇంగిడికి అవకాశం ఇచ్చింది.
undefined
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు: నితీశ్ రాణా, శుబ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, మోర్గాన్, దినేశ్ కార్తీక్, సునీల్ నరైన్, రస్సెల్, ప్యాట్ కమ్మిన్స్, కమ్లేశ్ నాగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ
undefined
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్, మోయిన్ ఆలీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ధోనీ, సామ్ కుర్రాన్, శార్దూల్ ఠాకూర్, లుంగి ఇంగిడి, దీపక్ చాహార్
undefined
click me!