ఎట్టకేలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం... ఆమె ముఖంలో చిరునవ్వు...

Published : Apr 21, 2021, 06:58 PM ISTUpdated : Apr 21, 2021, 07:18 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ విజయాన్ని సొంతం చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత తొలి విజయాన్ని అందుకోగా, మొదటి విజయం తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో ఓడింది పంజాబ్ కింగ్స్... 

PREV
110
ఎట్టకేలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం... ఆమె ముఖంలో చిరునవ్వు...

121 పరుగుల టార్గెట్... బెయిర్ స్టో, కేన్ విలియంసన్, డేవిడ్ వార్నర్ వంటి హిట్టర్లున్న జట్టు. హ్యాట్రిక్ మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 10 లేదా 11 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగుస్తుందని భావించారంతా.  అయితే బాల్‌కో పరుగు చేసినా సరిపోయే స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి కూడా 19 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి, చేధించింది ఆరెంజ్ ఆర్మీ...

210
310

121 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి శుభారంభం దక్కింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో కలిసి మొదటి వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం అందించారు.

410

లక్ష్యం చిన్నది కావడంతో పెద్దగా హడావుడి లేకుండా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు, 10 ఓవర్లలో 73 పరుగులు జోడించారు.

510

37 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 37 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, ఫ్యాబియన్ ఆలెన్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

610

వార్నర్‌ను అవుట్ చేసిన ఫ్యాబియన్ ఆలెన్, ఆ ఓవర్‌లో పరుగులేమీ ఇవ్వకపోవడం, ఆ తర్వాత పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కొద్దిగా ఉత్కంఠ రేగింది...

710

గత మూడు మ్యాచుల్లో జరిగిన అనుభవం కారణంగా రిస్కీ షాట్లు ఆడేందుకు సాహసించలేదు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌‌మెన్ కేన్ విలియంసన్, బెయిర్ స్టో.

810

11వ ఓవర్‌లో డేవిడ్ వార్నర్ అవుటైన తర్వాత ఏడు ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా సాధించలేకపోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 18వ ఓవర్‌ మొదటి బంతికి బౌండరీ బాదిన బెయిర్ స్టో, ఐపీఎల్‌లో ఏడో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

910

అర్ష్‌దీప్ సింగ్ వేసిన 19వ ఓవర్‌లో సిక్సర్ బాదిన బెయిర్ స్టో... మరో 3 పరుగులురాబట్టగా... వైడ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి పరుగు వచ్చేసింది. 9 వికెట్ల తేడాతో తొలి విజయం అందుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.

1010

సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా పరాజయాలు చవిచూస్తుండడంతో స్టేడియంలోనే భావోద్వేగానికి లోనైన ఎస్‌ఆర్‌హెచ్ యజమాని కావ్యా మారన్... ఎట్టకేలకు నవ్వు ముఖంతో వెలిగిపోవడం చూశారు ఆరెంజ్ ఆర్మీ అభిమానులు. 

click me!

Recommended Stories