తనకంటే ఐదేళ్లు పెద్దదైన అంజలిని 1995లో పెళ్లి చేసుకున్నాడు సచిన్ టెండూల్కర్...
వీరికి ఓ కూతురు సారా టెండూల్కర్, ఓ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఉన్నారు..
ప్రేమకు వయసుతో కూడా సంబంధం లేదని నిరూపించింది సచిన్, అంజలి జంట...
1990లో ఓ అంతర్జాతీయ టూర్ నుంచి స్వదేశానికి వస్తున్నాడు సచిన్ టెండూల్కర్...
ఆ సమయంలో తన తల్లిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన అంజలిని ఎయిర్‌పోర్టులో చూసి, తొలి చూపులోనే మనసు పారేసుకున్నాడు.
ఆ తర్వాత ఓ పార్టీలో స్నేహితుల ద్వారా ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా, ప్రేమగా మారింది
‘నాకు క్రికెట్ గురించి ఏమీ తెలీదు, సచిన్‌కి నేను ఎక్కువగా నచ్చడానికి అది కూడా ఓ కారణం కావచ్చు. టెండూల్కర్ పరిచయం వరకూ నాకు సచిన్ ఎవ్వరో కూడా తెలీదంటే నమ్మరేమో’ అని చెప్పుకొచ్చింది అంజలి.
అంజలి, సచిన్ టెండూల్కర్ కలిసి ఓ మూవీకి వెళ్లారు. తనని చూస్తే జనం గుమగూడతారని థియేటర్‌కి లేటుగా వెళ్లాడు సచిన్. అయితే ఇంటర్వెల్‌లో సచిన్‌ను చుట్టుముట్టేశారు జనం. టెండూల్కర్ ఫాలోయింగ్ చూసి షాక్ అయ్యింది అంజలి.
అంజలి, సచిన్ టెండూల్కర్ ఐదేళ్లు కలిసి డేటింగ్ చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.
‘నాకు నా జీవితంలో సచిన్ టెండూల్కర్ తప్ప మరో వ్యక్తి తెలీదు. అతన్ని బాగా అర్థం చేసుకున్నాను. నేను అతని గర్ల్ ఫ్రెండ్ కావచ్చు లేక భార్యను కావచ్చు. మా మధ్య బంధం మాత్రం పెరుగుతూనే ఉంది’ అని చెప్పుకొచ్చింది అంజలి.
మెడిసన్ ప్రాక్టీస్ చేస్తున్న అంజలి, పెళ్లి తర్వాత దాన్ని కూడా పక్కన బెట్టేసింది. టెండూల్కర్ కుటుంబాన్ని చూసుకుంటూ గడిపేస్తోంది.
‘సచిన్‌ను పెళ్లి చేసుకోకపోతే నాకు ఓ ఫుట్‌టైమ్ కెరీర్ ఉండేది. కానీ ఇప్పుడు అది వీలు కాదు. ఎందుకంటే సచిన్ ప్రతీదానికి నా మీద ఆధారడతాడు. ప్రతిదీ నా నిర్ణయమే..
సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నేను తిండి కూడా మానేస్తాడు. ఎన్ని సార్లు ఎవరు ఫోన్ చేసినా ఎత్తను. నీళ్లు కూడా తాగను. కదలను కూడా. సచిన్ అవుట్ అయ్యేదాకా ఒక్క మెసేజ్ కూడా చేయను.. ’ అని చెప్పింది అంజలి టెండూల్కర్.
అంజలి: ది సేవియర్... టెండూల్కర్ తన ఆటోబయోగ్రఫీలో అంజలి గురించి చాలాసార్లు ప్రస్తావించాడు. నేను కెప్టెన్‌గా ఫెయిల్ అయినప్పుడు నాకు సపోర్టుగా నిలిచింది. నా విజయంలో ఆమెకు కూడా పాత్ర ఉంటుంది...’ అని అంజలి గురించి రాసుకొచ్చాడు సచిన్ టెండూల్కర్.
సచిన్, అంజలి పెళ్లయ్యి 25 ఏళ్లు గడిచింది. సచిన్ వారసుడిగా అర్జున్ టెండూల్కర్ క్రికెటర్‌గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. కూతురు సారా, అంజలి వారసత్వాన్ని అందుకుని మెడిసిన్ పూర్తిచేసింది.