Ishan Kishan. (Photo- IPL)
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఏడాదికేడాది మరింత అద్భుతంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ప్రారంభమైన ఐదు మ్యాచుల్లోనే గత సీజన్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈసారి కూడా రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతోంది.
ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభమైన మొదటి ఐదు మ్యాచ్ ల్లోనే పరుగుల వర్షం కురుస్తోంది. ధనాధన్ ఇన్నింగ్స్ లతో బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టిస్తున్నారు. మార్చి 25న, పంజాబ్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగ్గా పంజాబ్ స్కోరు బోర్డుపై 244 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇది 5వ 200+ స్కోరు.
IPL 2025
ఐపీఎల్ 2025లో పరుగులే పరుగులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ఈ) 2025 మొదటి ఐదు మ్యాచ్ లను గమనిస్తే ఇందులో 10 ఇన్నింగ్స్‌లలో 6 సార్లు జట్లు 200+ మ్యాచ్‌లు ఆడాయి. పరుగుల సునామీలో మొదటి స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ లో ఉంది. తన తొలి మ్యాచ్‌లోనే 286 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరుగా నిలిచింది. ఐదు మ్యాచ్‌లలో మూడు జట్లు మొదటి ఇన్నింగ్స్‌లో 200+ స్కోరును దాటడం విశేషం.
Mitchell Marsh (Photo: IPL)
ఐపీఎల్ 2025లో అత్యధిక స్కోర్ చేసిన తొలి జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై SRH 286 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ సెంచరీతో అదరగొట్టాడు. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) పై 208 పరుగులు చేసింది.
దీని తర్వాత పంజాబ్ కింగ్స్ టీమ్ గుజరాత్ టైటాన్స్ పై ధనాధన్ ఇన్నింగ్స్ తో 244 పరుగులు చేసింది. మూడు మ్యాచ్‌లలోనూ, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు పరుగుల సునామీ రేపింది. మొదటి ఐదు మ్యాచ్ లలో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన జట్లు 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచాయి.
Ashutosh Sharma celebrating win (Photo: @iplX)
ఐపీఎల్ 2025 లో సిక్సర్ల వర్షం కురుస్తోంది !
ఐపీఎల్ 2025 సీజన్‌లో మొదటి నాలుగు మ్యాచ్‌ల తర్వాత మొత్తం 119 సిక్సర్లు బాదారు. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 58 సిక్సర్లు బాదగా, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన బ్యాట్స్‌మెన్ 61 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ లో తొలి ఆరు మ్యాచ్ లు పూర్తయిన తర్వాత మొత్తం 205 ఫోర్లు నమోదయ్యాయి. అలాగే, 133 సిక్సర్లు బాదారు.