కేకేఆర్ కథ మార్చిన యోధుడు అతనే... వెంకటేశ్ అయ్యర్‌కి టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు ఇస్తే...

First Published Oct 14, 2021, 9:20 AM IST

ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. కేకేఆర్ కనీసం ప్లేఆఫ్స్ చేరుతుందనే నమ్మకం కూడా ఎవ్వరికీ లేదు. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్... ఆఖరికి ఆఖరి ప్లేస్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ప్లేఆఫ్స్ చేరొచ్చని ఆశించారు, అంచనా వేశారు... కానీ వారి అంచనాలను తలకిందులు చేశాడు ఒకే ఒక్క ప్లేయర్.... అతని పేరే వెంకటేశ్ అయ్యర్...

ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లో కేకేఆర్ బ్యాటింగ్ చాలా చప్పగా సాగింది. ముఖ్యంగా టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్ వేగంగా పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడ్డారు...

శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా వంటి ఓపెనర్లు బ్యాటింగ్ చేసిన తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వెల్లగక్కాడు కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్...

అయితే సెకండాఫ్‌లో నితీశ్ రాణాను మిడిల్ ఆర్డర్‌కి మారుస్తూ, వెంకటేశ్ అయ్యర్‌ను ఓపెనర్‌గా పంపుతూ చేసిన ప్రయత్నం సూపర్ సక్సెస్ అయ్యింది...

మొదటి 7 మ్యాచుల్లో రెండే రెండు విజయాలు అందుకున్న కేకేఆర్, సెకండాఫ్‌లో ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలు అందుకున్న టాప్ 4లో నిలిచి ప్లేఆఫ్స్‌కి దూసుకొచ్చింది...

మొదటి ఎలిమినేటర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును, రెండో క్వాలిఫైయర్‌లో లీగ్ స్టేజ్‌లో టేబుల్ టాపర్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి ఫైనల్‌కి దూసుకెళ్లింది...

ఫస్టాఫ్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన జట్టు, సెకండాఫ్‌లో సూపర్ హిట్ కావడానికి కారణం ఏంటి? ఈ బ్రేక్‌లో టీమ్‌లో ఏ మార్పు జరిగింది. ఆ మార్పు పేరే వెంకటేశ్ అయ్యర్...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చాడు వెంకటేశ్ అయ్యర్. యజ్వేంద్ర చాహాల్ వేసిన ఓవర్‌లో మూడు ఫోర్లు బాది మ్యాచ్‌ను ఫినిష్ చేసిన వెంకటేశ్ అయ్యర్... బ్రెండన్ మెక్‌కల్లమ్‌కి కావాల్సిన దూకుడు చూపించాడు...

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో  3 ఫోర్లతో 18 పరుగులు చేసి నిరాశ పరిచాడు..

ఆ తర్వాత ఢిల్లీతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 14 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 67 పరుగులు చేసి అదరగొట్టాడు...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచినా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు...

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 26 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, రెండో క్వాలిఫైయర్‌లో 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేసి దుమ్మురేపాడు... 

శుబ్‌మన్ గిల్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికే ఇబ్బంది పడిన చోటు, ఫ్రీగా బౌండరీలు బాదుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఆడిన 9 మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు బాది, ఘనమైన ఎంట్రీ ఇచ్చాడు... ఐపీఎల్ 2021 సీజన్‌లో  320 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్,  మొదటి 9 మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ప్లేయర్‌గా నిలిచాడు.. 

అయ్యర్ వచ్చాక శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో దూకుడు పెరిగింది. ఫస్టాఫ్‌లో టీ20ల్లో టెస్టులు ఆడుతున్నాడని విమర్శలు ఎదుర్కొన్న శుబ్‌మన్ గిల్, సెకండాఫ్‌లో ఫ్రీగా సిక్సర్లు కొట్టగలుగుతున్నాడు. ఇది అతని ఓపెనింగ్ పార్టనర్ ఇచ్చిన నమ్మకమే...

‘వెంకటేశ్ అయ్యర్‌ను గుర్తించింది కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమే. ఓ మై గాడ్... అతనిలో అద్భుతమైన టాలెంట్ ఉంది. అయ్యర్ బ్యాటింగ్ చూస్తుంటే, అతను బ్యాటింగ్ చేసింది ఈ పిచ్‌పైనేనా అనిపించింది...’ అంటూ కామెంట్ చేశాడు కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్...

అద్భుతంగా అదరగొడుతూ బౌలింగ్‌లోనూ మంచి పేస్ జెనరేట్ చేస్తున్న వెంకటేశ్ అయ్యర్‌ను సరిగ్గా సానబెడితే, టీమిండియా ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కొరత తీరినట్టే...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి నెట్ బౌలర్‌గా ఎంపికైన వెంకటేశ్ అయ్యర్, యూఏఈలోనే భారత జట్టు బయో బబుల్‌లో ఉండబోతున్నాడు. లక్కు కలిసి వస్తే, టీమిండియాలోకి అయ్యర్ ఎంట్రీ ఇచ్చినా ఇవ్వొచ్చని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్... 

click me!