టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో విరాట్ ఆడిన ఆ ఇన్నింగ్సే తోపు... ఐసీసీ గ్రేటెస్ట్ మూమెంట్స్‌ పోటీలో...

First Published Oct 13, 2021, 7:44 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌ కథ క్లైమాక్స్‌కి చేరుకుంది. ఏడో సీజన్ టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ పొట్టి వరల్డ్‌కప్‌కి మరింత క్రేజ్ పెంచేందుకు గత ఆరు టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో జరిగిన మూమెంట్స్‌పై ఆన్‌లైన్ ఓటింగ్ నిర్వహించింది ఐసీసీ...

సెప్టెంబర్ 17 నుంచి మొదలైన ఈ ఆన్‌లైన్ ఓటింగ్‌లో 2016 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌... ‘గ్రేటెస్ట్ మూమెంట్స్’గా నిలిచింది... 

రౌండ్ 32 పేరుతో బెస్ట్ మ్యాచ్ మూమెంట్స్‌ను సెలక్ట్ చేసి... క్రికెట్ ఫ్యాన్స్ ఓట్లతో రౌండ్ 16, రౌండ్ 8, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్... ఫైనల్స్‌లో అత్యధిక ఓట్లు వచ్చిన మూమెట్‌కి ఓ విన్నర్‌ను నిర్ణయిస్తారు...

టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో 2016 టోర్నీలో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌...  అదే వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌లో బ్రాత్‌వైట్ కొట్టిన నాలుగు సిక్సర్లు ఇన్నింగ్స్‌ను ఓడించి... ‘గ్రేటెస్ట్ మూమెంట్స్’ ఫైనల్ విన్నర్‌గా నిలిచింది...

టీ20 వరల్డ్‌కప్ 2016 సూపర్ 12 రౌండ్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది... 161 పరుగుల లక్ష్యఛేదనలో రోహిత్, ధావన్, సురేష్ రైనా వికెట్లను త్వరగా కోల్పోయింది భారత జట్టు.

అయితే 51 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 పరుగులతో ఒంటరి పోరాటం చేసి టీమిండియాకి ఘన విజయాన్ని అందించాడు... విరాట్ కోహ్లీ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయిందీ ఇన్నింగ్స్...

విరాట్ కోహ్లీ ఆడిన ఈ చారిత్రక ఇన్నింగ్స్‌కి, బ్రాత్‌వైట్ ఫైనల్ ఇన్నింగ్స్‌తో పోలిస్తే రెట్టింపు ఓట్లు రావడం విశేషం. బ్రాత్‌వైట్ ఇన్నింగ్స్‌కి 32 శాతం ఓట్లు పడగా, విరాట్ ఇన్నింగ్స్‌కి 68 శాతం ఓట్లు పోల్ అయ్యాయి.

39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న విరాట్ కోహ్లీ, టీమిండియా విజయానికి 21 బంతుల్లో 45 పరుగులు కావాల్సిన దశలో గేర్ మార్చి, బౌండరీలతో విరుచుకుపడ్డాడు.

18వ ఓవర్‌లో 19 పరుగులు రాబట్టిన విరాట్ కోహ్లీ, 19వ ఓవర్‌లో నాలుగు బౌండరీలతో 16 పరుగులు రాబట్టాడు.  ఆఖరి ఓవర్‌లో 4 పరుగులు కావాల్సిన దశలో బౌండరీ కొట్టిన ఎమ్మెస్ ధోనీ, మ్యాచ్‌ను ముగించాడు.

2016 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో 273 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు గెలుచుకున్నాడు... 

టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో మొత్తంగా 16 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ, 86.33 సగటుతో 777 పరుగులు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కెప్టెన్‌గా మొట్టమొదటి, ఆఖరి టీ20 వరల్డ్‌కప్ ఆడుతున్న విరాట్ నుంచి మరోసారి ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నారు కోహ్లీ ఫ్యాన్స్...

click me!