ప్రపంచానికి కింగ్ కోహ్లీవి అయినా, నాకు మాత్రం చీకూవే... విరాట్‌కి యువీ స్పెషల్ గిఫ్ట్..

Published : Feb 22, 2022, 01:04 PM IST

క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని స్టార్‌ విరాట్ కోహ్లీ. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఓ స్పెషల్ గిఫ్ట్‌ పంపించాడు...

PREV
110
ప్రపంచానికి కింగ్ కోహ్లీవి అయినా, నాకు మాత్రం చీకూవే... విరాట్‌కి యువీ స్పెషల్ గిఫ్ట్..

టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా, వన్డేల్లో అత్యధిక విజయాలు శాతం నమోదు చేసిన కెప్టెన్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ... మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు...
 

210

విరాట్ కోహ్లీకి మాజీ భారత క్రికెటర్, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్... గోల్డెన్ బూట్స్‌తో ఓ సందేశాన్ని కానుకగా పంపాడు...

310

‘విరాట్, నువ్వు క్రికెటర్‌గా, వ్యక్తిగా ఎదగడాన్ని నేను చూస్తూ వచ్చాను. నెట్స్‌లో కుర్రాడిగా ఉన్నప్పటి నుంచి క్రికెట్ లెజెండ్‌గా ఎదిగివరకూ నీతో కలిసి నడిచాను...
 

410

కొత్త తరాన్ని నడిపించడంలో నువ్వు నిజమైన లెజెండ్‌వి. నీ క్రమశిక్షణ, పట్టుదల, అంకిత భావం, అన్నింటికీ మించి క్రికెట్‌పై నీకున్న డెడికెషన్... దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరినీ స్ఫూర్తిదాయకంగా నిలిచాయి...

510

ఏటికేటికీ నిన్ను నువ్వు మరింత మెరుగు పర్చుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే క్రికెట్‌లో కెప్టెన్‌గా, ప్లేయర్‌గా నువ్వు ఎంతో సాధించేశావ్..

610

నీ కెరీర్‌లో కొత్త ఛాప్టర్‌లో ఎలాంటి ముద్ర వేస్తావోనని చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా... ప్రపంచానికి నువ్వు కింగ్ కోహ్లీని అయినా నాకు మాత్రం ఎప్పటికీ చీకూవే...

710

ఓ టీమ్‌ మేట్‌గా, అంతకుమించి ఓ స్నేహితుడిగా నీతో అనుబంధాన్ని పంచుకోవడం నాకు గర్వకారణం. కలిసి పరుగులు చేశాం, ఒకరినొకరు ఆటపట్టించుకున్నాం...

810

ఛీటింగ్ మీల్స్ తిన్నాం, పంజాబీ సాంగ్స్‌ వింటూ స్టెప్పులేశాం.. టోర్నీలు గెలిచాం... అన్నీ కలిస చేశాం. నీలో ఉన్న ఆ జ్వాలను ఎప్పుడూ రగిలిస్తూ ఉండు... నువ్వు సూపర్ స్టార్‌వి.

910

లెజెండరీ కెప్టెన్, అద్భుతమైన లీడర్... నీ కోసం ఈ స్పెషల్ గోల్డెన్ బూట్స్... దేశాన్ని గర్వపడేలా చేస్తూ ఉండు...’ అంటూ రాసుకొచ్చాడు యువరాజ్ సింగ్...

1010

టీమిండియా తరుపున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచులు ఆడిన యువరాజ్ సింగ్, ఓవరాల్‌గా 10 వేలకు పైగా అంతర్జాతీయ పరుగులు చేశాడు. 

Read more Photos on
click me!

Recommended Stories