భారత సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ స్టైలే వేరు. క్యాచ్ పట్టిన తర్వాత స్టేడియంలో ఉన్న ప్రేక్షకుల వైపు తిరిగి తొడ కొట్టి, మీసం తిప్పుతూ సెలబ్రేట్ చేసుకుంటాడు శిఖర్ ధావన్. ఈ స్ట్రైల్ కారణంగానే శిఖర్ ధావన్‌ని గబ్బర్ అని ముద్దుగా పిలుస్తుంటారు...
210
శ్రీలంక టూర్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన శిఖర్ ధావన్, మొట్టమొదటి టాస్ గెలిచిన తర్వాత కూడా తొడ కొట్టి సెలబ్రేట్ చేసుకోవడం విశేషం...
310
భారత మహిళా క్రికెటర్లు జేమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన కలిసి చేసే ‘డబుల్ ట్రబుల్’ యూట్యూబ్ షోలో ఈ సెలబ్రేషన్స్ గురించి బయటపెట్టాడు శిఖర్ ధావన్...
410
‘నేను మొదటిసారి ఈ సెలబ్రేషన్స్‌ని కబడ్డీ మ్యాచుల్లో చూశాను. పాయింట్ సాధించిన తర్వాత రైడర్ రియాక్ట్ అయ్యే తీరు నాకు బాగా నచ్చింది. అందుకే ఆ సెలబ్రేషన్‌ని నేను కూడా ఫాలో అవ్వడం మొదలెట్టాను...’ అంటూ చెప్పుకొచ్చాడు శిఖర్ ధావన్...
510
తాజాగా శిఖర్ ధావన్ తొడ కొట్టే మేనరిజాన్ని కాపీ కొట్టినందుకు ఓ పాకిస్తాన్ క్రికెటర్‌కి భారీగా ఫైన్ వేసింది పాక్ క్రికెట్ బోర్డు... అతని పేరు సాజిద్ ఖాన్.
610
పాకిస్తాన్ స్పిన్నర్ అయిన సాజిద్ ఖాన్, ఇప్పటికే రెండు సార్లు క్రీజులో తొడ కొట్టి సెలబ్రేట్ చేసుకున్నందుకు ఫైన్ కట్టాడట...
710
‘అందరూ నేను శిఖర్ ధావన్ సెలబ్రేషన్ స్టైల్‌ని కాపీ కొడుతున్నా అనుకుంటారు. అయితే ప్రతీ ఒక్కరికీ ఒక్కో సెపరేట్ మేనరిజం, స్టైల్ ఉంటాయి. అయితే నేను స్కూల్ డేస్ నుంచే ఇలా చేస్తున్నాను...
810
కేవలం ఇది నా స్టైల్, ఎవరిక స్టైల్‌కి కాపీ కాదని చెబుతున్నా. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నందుకు నాకు రెండు సార్లు ఫైన్ కూడా వేశారు..’ అంటూ చెప్పుకొచ్చాడు సాజిద్ ఖాన్...
910
ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకున్న సాజిద్ ఖాన్, 2021లో జింబాబ్వేతో జరిగిన సిరీస్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు.
1010
నాలుగు టెస్టుల్లో 18 వికెట్లు తీసి అదరగొట్టిన సాజిద్ ఖాన్, ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లో అస్త్రంగా వాడాలని భావిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ జట్టు...