Published : Feb 22, 2022, 10:03 AM ISTUpdated : Feb 22, 2022, 10:04 AM IST
Sourav Ganguly Brother Comments On Saha: తాను బీసీసీఐలో ఉన్నంతకాలం జట్టులో స్థానంపై హామీ ఇచ్చిన గంగూలీ.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని వ్యాఖ్యానించిన సాహాపై బీసీసీఐ చీఫ్ అన్న...
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ సౌరవ్ గంగూలీని ఉద్దేశిస్తూ టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చేసిన వ్యాఖ్యలపై అతడి సోదరుడు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు స్నేహశీష్ గంగూలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
26
గంగూలీ తో ప్రైవేట్ గా మాట్లాడుకున్న మాటలను ఎలా బహిర్గతం చేస్తావని మందలించాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్ కు సాహాను ఎంపిక చేయకపోవడంతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు చిలికి చిలికి గాలి వానలా మారింది.
36
తాజాగా స్నేహశీష్ గంగూలీ స్పందిస్తూ.. ‘బీసీసీఐ అధ్యక్షుడితో మాట్లాడిన మాటలను సాహా ఇలా బయటపెట్టడం బావ్యం కాదు. సాహా ఇలా చేసి ఉండకూడదు. ఇది నా సొంతం అభిప్రాయం మాత్రమే..’ అని అన్నాడు.
46
బెంగాల్ తరఫున రంజీలు ఆడమని సాహాకు చెప్పామని కానీ అతడు వ్యక్తిగత కారణాల దృష్ట్యా వాటినుంచి తప్పుకున్నాడని స్నేహశీష్ తెలిపాడు. ‘రంజీలు ఆడాలని సాహాకు సూచించాం. కానీ అతడు వ్యక్తిగత కారణాలు చెప్పి రంజీలకు దూరంగా ఉన్నాడు. అతడి కోసం మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. సాహా ఎప్పుడైనా మా జట్టుతో కలవవచ్చు...’ అని చెప్పాడు.
56
నాలుగు రోజుల క్రితం శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో పుజారా, రహానే, ఇషాంత్ ల తో పాటు సాహాను కూడా పక్కనబెట్టారు సెలెక్టర్లు.. అయితే జట్టు ప్రకటన అనంతరం సాహా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి.
66
తాను బీసీసీఐ లో ఉన్నంత కాలం సాహాకు ఏ డోకాలేదని, అతడు జట్టులో ఉంటాడని సౌరవ్ గంగూలీ తనకు హామీ ఇచ్చాడని, కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తూ.. సాహా ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.