ఎమ్మెస్ ధోనీ దారిలో నడుస్తున్న కశ్మీరీ కుర్రాళ్లు... కెప్టెన్ కూల్ బిజినెస్ ఐడియాతో కఢక్‌నాథ్ కోళ్లతో...

First Published Jan 15, 2022, 5:25 PM IST

క్రికెట్ ప్రపంచంలో మహేంద్ర సింగ్ ధోనీ అంటే కేవలం ఓ పేరు కాదు, అదో బ్రాండ్. మాహీకి ఉన్న మాస్ ఫాలోయింగ్ చూస్తే, మెంటల్ ఎక్కిపోద్ది... అలాంటి మాహీ దారిలో నడుస్తున్నారు ఇద్దరు కశ్మీరీ విద్యార్థులు... 

క్రికెట్ గురించి పెద్దగా తెలియని వారికి కూడా మహేంద్ర సింగ్ ధోనీ సుపరిచితుడే. క్రికెట్‌లో కొనసాగుతున్నప్పుడు ‘ఎమ్మెస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ మూవీ ద్వారా జనాల్లోకి వెళ్లిన మాహీ, వ్యాపార ప్రకటనల ద్వారా మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు...

ఒకానొకదశలో సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించి, వ్యాపార ప్రకటనల ద్వారా చేతుల నిండా సంపాదించాడు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ...

అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వ్యవసాయంపై ఎక్కువ ఫోకస్ పెట్టిన మాహీ, తన స్వగ్రామంలో సేంద్రీయ పద్ధతిలో పంటలు పండిస్తూ, వాటిని యూఏఈ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నాడు...

సేంద్రీయ సాగుతో పాటు పాలు, పాల ఉత్పత్తులు, కోళ్లు, పౌల్ట్రీ పరిశ్రమను కూడా ప్రారంభించాడు ధోనీ. రాంచీలోని తన 50 ఎకారాల మాహీ ఫామ్ హౌజ్‌లో కఢక్‌నాథ్ కోళ్లను కూడా పెంచుతున్నాడు...

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ ఏరియాల్లో దొరికే అత్యంత అరుదైన కఢక్‌నాథ్ కోళ్లను రాంఛీ తెప్పించుకుని, వాటి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశాడు ధోనీ...

తాజాగా మాహీ నుంచి స్ఫూర్తిపొందిన ఇద్దరు కశ్మీర్ యువకులు, మంచుకొండల్లో ఈ నల్లకోళ్ల ఫామ్‌ను ఏర్పాటు చేశారు. శ్రీనగర్ సమీపంలో ఉండే నుమైర్ రషీద్, మమూన్ ఖాన్... ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశారు...

ఉద్యోగం కోసం ఎక్కడికో వెళ్లడం ఎందుకునే ఉద్దేశంతో శ్రీనగర్‌లోనే ‘ది రాయల్ ఫెదర్స్’ పేరుతో ఓ స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేసిన ఈ ఇద్దరూ, అందులో కఢక్‌నాథ్ కోళ్లను పెంచుతూ విక్రయిస్తున్నారు...

ఈ కశ్మీర్ యువకుల స్టార్టప్ ఐడియా, అక్కడి జనాలకు తెగ నచ్చేసింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కోడి మాంసంగా గుర్తింపు తెచ్చుకున్న కఢక్‌నాథ్ చికెన్ కోసం తెగ ఎగబడుతున్నాడట శ్రీనగర్ జనాలు...

ఈ కశ్మీర్ యువకులకు ఈ పౌల్టీ ఫామ్‌ పెట్టడానికి ఎమ్మెస్ ధోనీ స్ఫూర్తిదాయకం కాకపోయినా, కఢక్‌నాథ్ కోళ్లకు దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చినందుకు ఈ క్రెడిట్ కూడా మాహీకే దక్కింది....

click me!