టీమిండియా నెం.1 టెస్టు ర్యాంకు కూడా పోయినట్టే... ఐదో టెస్టులోనూ తీరు మారని ఇంగ్లాండ్...

First Published Jan 15, 2022, 4:42 PM IST

సౌతాఫ్రికాలో తొలి టెస్టు గెలిచి, టెస్టుల్లో నెం.1 ర్యాంకును తిరిగి కైవసం చేసుకున్న భారత జట్టు, వరుసగా రెండు మ్యాచుల్లో ఓడడంతో ఇప్పుడు ఏకంగా మూడో స్థానానికి పడిపోయే ప్రమాదంలో పడింది...

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో గెలిచిన టీమిండియా, సెంచూరియన్‌లో విజయంతో ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లింది...

Aus vs Eng Ashes: কোনো মতে টেস্ট বাঁচাল ইংল্য়ান্ড, অধরা থেকে গেল অজিদের 'চুনকামের' ইচ্ছে

সিডনিতে (Sydney) অস্ট্রেলিয়া বনাম ইংল্য়ান্ডের (Australia vs England) অ্য়াসেজ সিরিজের (Ashes Sereis) চতুর্থ টেস্ট। ড্র (Draw) হল ম্য়াচ। এক উইকেটের জন্য জয় অধরা রয়ে গেল প্যাট কামিন্সের (Pat Cummins) দলের। সিরিজের প্রথম ম্য়াচ বাঁচাল জো রুটের (Joe Root) দল।
 

2021 ఏడాదిని నెం.1 టెస్టు టీమ్‌గా ముగించిన భారత జట్టు, వరుసగా ఐదో ఏడాది కూడా ఈ ఘనత సాధించినట్టైంది. అయితే ప్రస్తుతం టీమిండియా నెం.1 ర్యాంకు ప్రమాదంలో ఉంది...

వరుసగా రెండు టెస్టుల్లో ఓడిన టీమిండియా, 124 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నప్పటికీ 8 పాయింట్లు కోల్పోతుంది. వారాంతంలో ప్రకటించే తాజా ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ 117 పాయింట్లతో టాప్‌లోకి దూసుకెళ్లనుంది...

వరుసగా మూడు టెస్టుల్లో గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌ జట్టుపై 119, అంత కంటే ఎక్కువ తేడాతో గెలిస్తే... ఆస్ట్రేలియా 119 పాయింట్లతో టాప్‌లోకి దూసుకెళ్తుంది...

119 పాయింట్లతో ఆస్ట్రేలియా టాప్‌లోకి వెళితే, న్యూజిలాండ్ రెండో స్థానంలో, భారత జట్టు మూడో స్థానంలో ఉంటుంది. వచ్చే నెలలో జరిగే ఇండియా, శ్రీలంక రెండు టెస్టు సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తే, తిరిగి టాప్‌లోకి రావచ్చు...

ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్, నాలుగో టెస్టులో మంచి పోరాట ప్రటిమ చూపించి... టెస్టు డ్రా చేసుకోగలిగింది. అయితే ఐదో టెస్టులో ఇంగ్లాండ్ తీరు మళ్లీ మొదటికొచ్చింది...

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 303 పరుగులు చేసి ఆలౌట్ కాగా, ఇంగ్లాండ్ జట్టు 188 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జో రూట్ 34 పరుగులు చేయగా, క్రిస్ వోక్స్ 36 పరుగులు, సామ్ బిల్లింగ్స్ 29 పరుగులు చేశారు...

బెన్ స్టోక్స్ 4, ఓల్లీ పోప్ 14, రోరీ బర్న్స్ డకౌట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచారు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 4, మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీశారు...

115 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన ఆస్ట్రేలియాకి ఆరంభంలోనే ఊహించని షాక్ తగిలింది. డేవిడ్ వార్నర్ డకౌట్ కాగా, మార్నస్ లబుషేన్ 5 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

డేవిడ్ వార్నర్ మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ కావడం విశేషం. వార్నర్ వికెట్ తీసిన స్టువర్ట్ బ్రాడ్ 129 యాషెస్ సిరీస్ వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన ఇంగ్లాండ్ బౌలర్‌గా నిలిచాడు.

click me!