ఐపీఎల్ 2022 సీజన్‌ను 10 జట్లతో నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ, అందుకు తగినట్టుగానే మెగా వేలం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది...

మెగా వేలం నిబంధనల ప్రకారం ఏ ఫ్రాంఛైజీ అయినా అత్యధికంగా నలుగురు ప్లేయర్లను మాత్రమే అట్టిపెట్టుకునే అవకాశం ఉంటుంది. వీరిలో ఇద్దరు స్వదేశీ, ఇద్దరు విదేశీ... లేదా ముగ్గురు స్వదేశీ, ఓ విదేశీ ప్లేయర్‌ను రిటైన్ చేసుకునే వీలుంది...

ఒకవేళ ముగ్గురు ప్లేయర్లను అట్టి పెట్టుకుంటే మొదటి ప్లేయర్‌కి రూ.15 కోట్లు, రెండో ప్లేయర్‌కి 11, మూడో ప్లేయర్‌కి 7 కోట్లు, నాలుగో ప్లేయర్‌కి రూ.5 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే అట్టిపెట్టుకున్న ప్లేయర్ల కోసమే రూ.38 కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్న మాట.

అదే ముగ్గురే చాలనుకుంటే రూ.33 కోట్లు, ఇద్దరే కావాలనుకుంటే రూ.21 కోట్లు (రూ.12.5 కోట్లు+రూ.8.5కోట్లు)... ఒక్కరుంటే చాలనుకుంటే రూ.12.5 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నిబంధనలు ఐపీఎల్ ఫ్రాంఛైజీలను తెగ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏ ప్లేయర్‌ను అట్టిపెట్టుకోవాలి? ఎవరిని వదలాలనేది తేల్చడానికి ఆపసోపాలు పడే అవకాశం ఉంది...

ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ డేవిడ్ వార్నర్‌కి రూ.12.5 కోట్లు, కేన్ విలియంసన్‌కి రూ.3 కోట్లు, రషీద్ ఖాన్‌కి రూ.9 కోట్లు, మనీశ్ పాండేకి రూ.11 కోట్లు చెల్లిస్తోంది...

వీళ్లు కాకుండా విజయ్ శంకర్‌కి రూ.3 కోట్ల 20 లక్షలు, భువనేశ్వర్ కుమార్‌కి రూ.8 కోట్ల 50 లక్షలు చెల్లిస్తోంది. వీరిలో ఐపీఎల్ 2021 సీజన్‌లో జరిగిన పరిణామాల కారణంగా డేవిడ్ వార్నర్‌ను అట్టిపెట్టుకోవాలని సన్‌రైజర్స్ భావించకపోవచ్చు...

కేన్ విలియంసన్‌ను అట్టిపెట్టుకుంటే, అతను కెప్టెన్ కాబట్టి రూ.3 కోట్ల నుంచి ఇకపై రూ.15 నుంచి రూ.12.5కోట్ల వరకూ చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే మనీశ్ పాండేని అట్టిపెట్టుకున్నా అతనికి భారీగా ముట్టచెప్పాల్సిఉంటుంది...

నలుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉండడంతో ఆరేంజ్ ఆర్మీ... భువీ, మనీశ్ పాండే, రషీద్ ఖాన్, కేన్ విలియంసన్‌లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంది...

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్‌దీ ఇదే పరిస్థితి. ప్రస్తుతం సీఎస్‌కే కెప్టెన్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీకి ఏటా రూ.15 కోట్లు చెల్లిస్తోంది. సురేశ్ రైనాకి రూ.11 కోట్లు చెల్లిస్తున్నారు.

వీళ్లు కాకుండా మొయిన్ ఆలీని రూ.7 కోట్లకు, సామ్ కుర్రాన్‌ని రూ.5 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసిన సీఎస్‌కే, రవీంద్ర జడేజాకి రూ.9కోట్ల 20 లక్షలకు చెల్లిస్తోంది...

వీరిలో మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా ఇంకా మూడేళ్ల పాటు ఐపీఎల్‌లో కొనసాగుతారా? లేదా? చెప్పడం కష్టం. వీరిద్దరినీ అట్టిపెట్టుకుంటే, వాళ్లు వచ్చే సీజన్‌లో లేదా ఆపైన రిటైర్మెంట్ ప్రకటిస్తే సీఎస్‌కేకి ఇబ్బందులు తప్పవు...

పోనీ రవీంద్ర జడేజా, మొయిన్ ఆలీ, సామ్ కుర్రాన్, డుప్లిసిస్ వంటి వాళ్లను అట్టిపెట్టుకోవాలని చూస్తే... వారికి రెట్టింపు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది...

అదీకాకుండా మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనాలను వేలానికి వదిలేస్తే జరిగే ప్రమాదం భారీగా ఉంటుంది. అసలు సీఎస్‌కే ఉన్న భారీ క్రేజ్‌కి కారణమే వీళ్లు... దీంతో సీఎస్‌కే ఎవరిని అట్టిపెట్టుకుంటుంది? ఎవరిని వేలానికి వదులుతుందనేది ఆసక్తికరంగా మారింది...