వాళ్లు నీ అంత క్రికెట్ ఆడకపోవచ్చు.. కానీ కెప్టెన్సీ నిర్ణయం వాళ్లదే.. కోహ్లీ వ్యాఖ్యలపై కపిల్ దేవ్ కౌంటర్

Published : Dec 16, 2021, 01:01 PM IST

kapil Dev Comments On Virat kohli: టీమిండియా కెప్టెన్సీ వివాదం తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. బుధవారం ప్రెస్ మీట్ లో విరాట్ కోహ్లీ.. బీసీసీఐ, సౌరవ్ గంగూలీ మీద చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు  చేశాడు. 

PREV
18
వాళ్లు నీ అంత క్రికెట్ ఆడకపోవచ్చు.. కానీ కెప్టెన్సీ నిర్ణయం వాళ్లదే.. కోహ్లీ వ్యాఖ్యలపై కపిల్ దేవ్ కౌంటర్

బీసీసీఐ, సౌరవ్ గంగూలీ లపై టీమిండియా టెస్టు జట్టు సారథి చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్ లో ప్రకంపనలు రేపుతున్నాయి.  కెప్టెన్సీ వ్యవహారం గురించి గంగూలీతో సహా బీసీసీఐకి సంబంధించిన వ్యక్తులెవరూ తనతో మాట్లాడలేదని కోహ్లీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

28

ఈ నేపథ్యంలో బీసీసీఐ.. గంగూలీ.. కోహ్లీ మధ్య ఏదో  జరుగుతుందనే అభిప్రాయాలు  వ్యక్తమవుతున్నాయి.  కాగా, తాజాగా ఈ వివాదంపై భారత క్రికెట్ కు తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ స్పందించాడు. 

38

కెప్టెన్సీ మార్పు విషయం కోహ్లీ కే కాదని, ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని, టీమిండియా టెస్టు కెప్టెన్ ఈ వివాదాన్ని ఎంత త్వరగా మరిచిపోయి ఆటమీద దృష్టిపెడితే అంత మంచిదని చురకలంటించాడు. 
 

48

కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘ఎవరెన్ని చెప్పినా బోర్డు ప్రెసిడెంట్ బోర్డు ప్రెసిడెంటే. టీమిండియా కెప్టెన్ కూడా పెద్ద విషయమే అనుకోండి.. కానీ ఒకరి గురించి ఒకరు బయట ఇలా మాట్లాడుకోవడం అది ఎంతమాత్రమూ మంచిది కాదు. అది సౌరవ్ అయినా  కోహ్లీ అయినా సరే. దాని గురించి బహిరంగంగా మాట్లాడటం జట్టుకు  మంచిది కాదు. 

58

మీరు పరిస్థితిని అదుపు చేసి దేశం  గురించి ఆలోచించండి. దేశం కోసం ఆడండి. జరిగిందేదో జరిగిపోయింది. కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు ఈ వివాదం ఎందుకు..?’ అని అన్నాడు. 

68

అంతేగాక.. ‘సెలెక్టర్లు  విరాట్ ఆడినంత క్రికెట్ ఆడిపోకపోవచ్చు. కానీ కెప్టెన్సీ గురించి నిర్ణయించే హక్కు వాళ్లకుంది. వారు  తమ నిర్ణయం  గురించి ఎవరికీ చెప్పాల్సిన పన్లేదు.

78

ఇది ఒక్క విరాట్  కే కాదు.. ప్రతి ఆటగాడికీ వర్తిస్తుంది. అయితే ఈ వివాదం కోహ్లీ టెస్టు  నాయకత్వంపై ప్రభావం చూపదని నేను భావిస్తున్నాను. ఇక విరాట్ ఇప్పుడు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి.. సౌతాఫ్రికా టూర్ మీద దృష్టి సారిస్తే మంచిదన నేను ఆశిస్తున్నా..’ అని  కపిల్ తెలిపాడు. 
 

88

ఇదిలాఉండగా.. మూడు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు దక్షిణాఫ్రికా  కు వెళ్లింది.  అక్కడ క్వారంటైన్ ముగిసిన తర్వాత  విరాట్ సేన.. డిసెంబర్ 26 నుంచి సెంచూరీయన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఆడనుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories