2021 సీజన్‌లో సన్‌రైజర్స్‌కి కేన్ విలియంసన్ దూరం... వార్నర్ సమాధానం ఏంటంటే...

First Published Nov 14, 2020, 12:21 PM IST

2020 ఐపీఎల్ సీజన్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలో దిగి, ప్లేఆఫ్‌కి అర్హత సాధించి అదరగొట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో మూడో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్, వరుసగా ఐదో సీజన్‌లోనూ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. అయితే వచ్చే సీజన్‌లో కేన్ విలియంసన్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి బయటికి వెళ్లబోతున్నాడనే వార్త అందర్నీ కలవరపరుస్తోంది.

న్యూజిలాండ్ కూల్ కెప్టెన్ కేన్ విలియంసన్... సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీ ప్లేయర్‌గా ఉన్నాడు. 2016లో కేన్ విలియంసన్‌ను కొనుగోలు చేసిన ఆరెంజ్ ఆర్మీ, అప్పటి నుంచి జట్టుతోనే కొనసాగిస్తోంది.
undefined
2016 సీజన్‌లో 6 మ్యాచులు ఆడిన కేన్ విలియంసన్, ఓ హాప్ సెంచరీతో 124 పరుగులు చేశాడు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై నిషేధం పడిన తర్వాత కేన్ అసలైన ఆట బయటికి వచ్చింది.
undefined
2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కేన్ విలియంసన్... ఎస్ఆర్‌హెచ్‌ను ఫైనల్‌లోకి చేర్చి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
undefined
2018 సీజన్‌లో 17 మ్యాచులు ఆడిన కేన్ విలియంసన్ 735 పరుగులు చేశాడు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఆ ఏడాది ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు కేన్.
undefined
2019 సీజన్‌లో వార్నర్ రీఎంట్రీ ఇచ్చినా కేన్ విలియంసన్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది సన్‌రైజర్స్. అయితే జట్టులో సమతౌల్యం కోసం తనకు తానే తుదిజట్టు నుంచి తొలిగి, భువనేశ్వర్ కుమార్‌కి కెప్టెన్సీ అప్పగించాడు కేన్.
undefined
2019 సీజన్‌లో 9 మ్యాచులు ఆడిన కేన్ విలియంసన్, ఓ హాఫ్ సెంచరీతో 156 పరుగులు చేశాడు. వార్నర్, బెయిర్ స్టో అదరగొట్టడంతో 2019లో విలియంసన్‌కి పెద్దగా అవకాశం రాలేదు.
undefined
2020 సీజన్‌లో 12 మ్యాచులు ఆడిన కేన్ విలియంసన్, 3 హాఫ్ సెంచరీలతో 317 పరుగులు చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్భాంధవుడిలా ఆదుకున్న కేన్, ఢిల్లీతో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు.
undefined
2021 ఐపీఎల్ కోసం మెగా వేలం జరగనుంది. ప్రతీ జట్టులో ఇద్దరు విదేశీ ప్లేయర్లు, ముగ్గురు స్వదేశీ ప్లేయర్లు మాత్రమే ఉంచుకుని, మిగిలిన ప్లేయర్లను వేలం కోసం విడుదల చేయాల్సి ఉంటుంది.
undefined
దీంతో డేవిడ్ వార్నర్‌తో పాటు రషీద్ ఖాన్‌ను వెంటపెట్టుకోవాలని అనుకుంటున్న సన్‌రైజర్స్, బెయిర్ స్టో, కేన్ విలియంసన్ వంటి స్టార్లను విడుదల చేయబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి..
undefined
ఇదే ప్రశ్నను డేవిడ్ వార్నర్‌ను ట్యాగ్ చేస్తూ అడిగేశాడు ఓ సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమాని. అతనికి రిప్లై ఇచ్చిన డేవిడ్ వార్నర్, ‘కేన్ విలియంసన్‌ను మేం వదులుకోం’ అని సమాధానం ఇచ్చాడు.
undefined
click me!